రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో సైబర్ మోసం వెలుగుచూసింది. సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలతో బురిడీ కొట్టిస్తున్నారు. కొన్ని రోజుల నుంచి జెమినీ ఏఐ ఫోటో ఎడిట్ యాప్ ద్వారా ఫొటోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసుకుని సంబరపడిపోతున్నారు. 3డీ ప్రింట్, నానో బనాన ఇలా రకరకాలుగా ఫోటోలను ఎడిట్ చేస్తుంది జెమినీ ఏఐ. అయితే జెమినీ ఏఐ ట్రెండింగ్ ఫోటో ఎడిట్ యాప్తో యువకుడికి రూ.70 వేల నష్టం వాటిల్లింది. ట్రెండింగ్లో ఉన్న […]
స్నేహానికన్నా మిన్నా లోకాన లేదు అంటారు. త్యాగానికి అర్ధం స్నేహం.. లోభానికి లొంగదు నేస్తం.. ప్రాణానికి ప్రాణం స్నేహం.. రక్తానికి రక్తం నేస్తం.. అలాంటి స్నేహానికి మచ్చ తెచ్చాడు ఓ వ్యక్తి. ఏకంగా స్నేహితుడి కుమార్తెపైనే అత్యాచారానికి ఒడిగట్టాడు 75 ఏళ్ల వృద్ధుడు. నిందితుడు తన స్నేహితుడి మైనర్ కుమార్తెపై అత్యాచారం చేయడం వంటి దారుణమైన నేరానికి పాల్పడ్డాడు. నిందితుడు మైనర్ను ఆమెకు ప్రసాదం తినిపించే నెపంతో తన ఇంటికి పిలిచి బలవంతంగా అత్యాచారం చేశాడు. ఈ […]
ఆసియా కప్లో భాగంగా నేడు భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. మరికొన్ని గంటల్లో దాయాదులతో పోరాడేందుకు భారత్ రెడీ అవుతోంది. అయితే పాక్ పై భారత ఆటగాళ్ల పెర్ఫామెన్స్ చాలా బాగుంది. కానీ ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఎందుకంటే రెండు జట్లలోనూ చాలా మంది ఆటగాళ్లు T20లో తొలిసారిగా ఒకరితో ఒకరు తలపడనున్నారు. పాకిస్తాన్ పై టీమిండియా ఆటగాళ్ల T20 రికార్డును పరిశీలించినట్లైతే.. Also Read:CM Chandrababu: సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దు.. సూర్యకుమార్ యాదవ్ […]
ఐఫోన్ ఎయిర్ లాంచ్ అయింది. ఈ స్మార్ట్ఫోన్ డిజైన్ గురించి చర్చలు లాంచ్ కావడానికి ముందే ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్ చాలా సన్నగా ఉంటుంది. దీని మందం కేవలం 5.5 మిమీ మాత్రమే. అయితే, ఐఫోన్ ఎయిర్ లాంటి డిజైన్తో వచ్చే మరో స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. ధర లక్ష రూపాయలు తక్కువ. టెక్నో పోవా స్లిమ్ 5G ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్ 5.95mm మందం, 156 గ్రాముల బరువు ఉంటుంది. ఈ […]
హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి కొడుకు పాలిట కాలయముడయ్యాడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కొడుకుని హత్య చేశాడు. అనంతరం బాలుడు మృతదేహాన్ని సంచిలో తీసుకెళ్లి నయా పుల్ బ్రిడ్జి పైనుంచి మూసిలో పడేశాడు. ఆ తర్వాత బాబు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు నిందితుడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా తండ్రిపై అనుమానం వ్యక్తం చేశారు. Also Read:Diarrhea: విజయవాడలో పెరుగుతున్న […]
తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ అంశం ఏదైనా ఉందంటే అది యూరియా కొరత మాత్రమే. గత కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. యూరియా లభించకపోవడంతో రైతన్నలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం చేస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్ లో నిల్చోని అలసిపోతున్నారు. అయినప్పటికీ యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలకు యూరియా అందించే సమయంలో యూరియా లేకపోవడంతో దిగుబడి తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Also Read:Boinapalli Medha School: […]
హైదరాబాద్ లో హెచ్ సిటీ క్రింద మరో ప్రాజెక్ట్ నిర్మాణం కాబోతోంది. రసూల్ పురాలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు కొత్త ఫ్లైఓవర్ నిర్మాణానికి జిహెచ్ఎంసి రెడీ అవుతోంది. వై ఆకారంలో ఫ్లైఓవర్ నిర్మించేందుకు డీపీఆర్ సిద్ధం చేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు.. మెట్రో రైల్ కార్యాలయం వద్ద ప్రారంభమై ఒక రోడ్డు మినిస్టర్ రోడ్డు వైపు, మరొకటి పాటిగడ్డ వైపు వెళ్లే విధంగా నిర్మాణం చేయాలని భావిస్తోంది. 150 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లకు ఆహ్వానిస్తున్న జిహెచ్ఎంసి.. Also […]
పాఠశాలలను దేవాలయాలుగా భావిస్తారు. భావి భారత పౌరులు రూపుదిద్దుకునేది పాఠశాలల్లోనే. అంతటి ప్రాముఖ్యత ఉన్న స్కూల్స్ లో డ్రగ్స్ తయారీకి తెగబడ్డాడు సమాజం పట్ల బాధ్యత లేని ఓ వ్యక్తి. బోయిన్పల్లి పరిధిలోని ఒక స్కూల్ లోపలే పెద్ద ఎత్తున మత్తుమందు తయారీ జరుగుతుందని గూఢచారి సమాచారంపై ఈగల్ టీం దాడి చేసింది. ఈ ఘటనలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. Also Read:Asaduddin: క్రికెట్ మ్యాచ్ 26 మంది ప్రాణాల కంటే విలువైనదా..? నిందితుడు జయప్రకాష్ గౌడ్ […]
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యూరియా టోకెన్ల కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఇద్దరు వ్యక్తులు. గూడూరు నుండి మహబూబాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై జగన్ నాయకులగూడెం స్టేజి వద్ద ప్రమాదం జరిగింది. దుబ్బగూడెం కు చెందిన దారావత్ వీరన్న బానోత్ లాల్య యూరియా టోకెన్ల కోసం బొద్దుగొండ వస్తుండగా ద్విచక్ర వాహనం, బొలేరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బానోత్ వాల్య మృతి చెందాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు […]