బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్నాయి. రూ. లక్షా 10 వేలు దాటింది తులం గోల్డ్ ధర. ఇవాళ ఒక్క రోజే రూ. 1360 పెరిగింది. సిల్వర్ ధరలు కూడా భగ్గుమన్నాయి. కిలో వెండిపై రూ. 3000 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.11,029, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,110 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల […]
ఇటీవల గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతుండడంతో ఆందోళన నెలకొంది. తమ పిల్లలకు ఎప్పుడు ఏమవుతుందో అని భయాందోళనకు గురవుతున్నారు తల్లిదండ్రులు. ఇప్పుడు మరో ఘటన చోటుచేసుకుంది. అయితే ఇది ఫుడ్ పాయిజన్ వల్ల మాత్రం కాదు. స్కూల్ ఆవరణలో దోమల మందు పిచికారీ చేయడంతో మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం చందనపూర్ గ్రామంలోని బాలుర గురుకుల పాఠశాలలో 16 మంది విద్యార్థుల అస్వస్థతకు గురయ్యారు. Also Read:Kovvur Midnight Clash: కొవ్వూరులో […]
మరో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఈ ఘోరానికి పాల్పడ్డారు. ముందుగా ట్రైన్ కింద పడి ప్రియురాలు ఆత్మహత్య చేసుకోగా.. ప్రియురాలి మృతిని తట్టుకోలేక ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. “వచ్చే జన్మలో అయినా నా బంగారు తల్లిని పెళ్లిచేసుకుంటా” అంటూ సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ప్రియుడు. ప్రేమ జంట మృతితో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. Also Read:US-India: భారత్‌పై మరోసారి నోరు పారేసుకున్న ట్రంప్ […]
ఆపిల్ లవర్స్ గెట్ రెడీ.. ఆపిల్ ఈ సంవత్సరం అతిపెద్ద ఈవెంట్‌ను నేడు నిర్వహించబోతోంది. ఇందులో కంపెనీ కొత్త ప్రొడక్టులను విడుదల చేయనుంది. ఐఫోన్ 17, 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో ఇందులో ఆవిష్కరించనున్నారు. అలాగే, ఆపిల్ ఎయిర్పాడ్లు, ఆపిల్ వాచ్ సిరీస్ 11 కూడా విడుదలకానున్నాయి. ఈ ఆపిల్ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు జరుగుతుంది. ఈ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆపిల్ పోర్టల్, యూట్యూబ్, అధికారిక సోషల్ మీడియా […]
తెలంగాణలో గ్రూప్ 1 అంశంపై తెలంగాణ హైకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. గ్రూప్ 1 అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పరీక్షలు రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2023 అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 21 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆ పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ ఈ ఏడాది మార్చి 10న విడుదల చేసింది. ఈ ఫలితాల్లో అభ్యర్థులకు వచ్చిన […]
నేపాల్‌లో ఒక రోజంతా అల్లకల్లోలం తర్వాత, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధాన్ని ప్రభుత్వం ఉపసంహరించింది. నిరసనకారులు తిరిగి రావాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. విధ్వంసం, దహనం సంఘటనలపై దర్యాప్తుకు ఆదేశించింది. హింసాత్మక నిరసనలపై, ప్రధాన మంత్రి కె.పి. శర్మ ఓలి మాట్లాడుతూ.. ఈ నిషేధం నిజమైన ఉద్దేశ్యాన్ని ప్రజలకు వివరించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. నిరసనకారుల చొరబాటు కారణంగా భయంకరమైన పరిస్థితి ఏర్పడిందని అర్ధరాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రధాన మంత్రి ఓలి తెలిపారు. ఖాట్మండుతో […]
భారత 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈరోజు పార్లమెంట్ హౌస్‌లో ఓటింగ్ జరగనుంది. ఎన్డీఏ అభ్యర్థి సీ.పీ. రాధాకృష్ణన్, ఇండియా బ్లాక్ అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి పోటీపడుతున్నారు. వసుధలోని రూమ్ నంబర్ F-101లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉదయం 10 గంటలకు ఓటు వేస్తారు. రహస్య బ్యాలెట్ విధానంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్నది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, లోక్‌సభ (543 మంది సభ్యులు), […]
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం పై కాంగ్రెస్ పార్టీ విషం చిమ్మింది.. ఎన్నికల ముందు విష ప్రచారం చేసింది.. ఎన్నికల తరువాత కూడా కాళేశ్వరం పై కక్ష కట్టింది.. కాళేశ్వరం పై కక్ష కట్టి సిబిఐ విచారణ కు ఆదేశించారు.. వారం తిరగక ముందే మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెస్తున్నాం అని పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు.. తల దగ్గర […]
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కొడుకు రాజకీయాల్లోకి ఎంట్రీపై సంచలన ప్రకటన చేశారు. నా కొడుకు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని తెలిపారు. అవసరమైనప్పుడు వైఎస్ రాజారెడ్డి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెడతారని తెలిపింది. నేడు తల్లితోపాటు కర్నూలు ఉల్లి మార్కెట్ పర్యటనలో పాల్గొన్నారు రాజారెడ్డి. ఉల్లి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. షర్మిల ఆశీర్వాదం తీసుకొని అమెతోపాటు కర్నూలు పర్యటనకు వెళ్లారు. వైఎస్ రాజారెడ్డి ఇంటి వద్ద నానమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకుని వెళ్లారు. […]
మహిళా ఆర్చరీ ఛాంపియన్ చికిత తనిపర్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. కెనడాలో జరిగిన 2025 యూత్ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం తరపున బంగారు పతకం గెలుచుకున్న తొలి మహిళగా రికార్డు సృష్టించింది చికిత. చైనాలోని షాంగైలో జరిగిన సీనియర్ వరల్డ్ కప్ జట్టు రజత పతకం సాధించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ చికితను అభినందించారు. ఒలంపిక్స్ లో పతకం సాధించేలా ప్రభుత్వం తరపున పూర్తి శిక్షణ అందించేందుకు అన్ని రకాలుగా […]