మలేషియా వేదికగా ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోడీ గైర్హాజరయ్యారు. మోడీ తరపున భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మలేషియాకు వెళ్లారు. ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోను జైశంకర్ కలిశారు.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం జరిగింది. 22 ఏళ్ల లా విద్యార్థిపై మెడికల్ షాపు నిర్వాహకులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. విద్యార్థి కడుపు కోసి.. వేళ్లు నరికివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని బాధిత విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహారాష్ట్ర వైద్యురాలి ఆత్మహత్య కేసులో రోజురోజుకి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తన కుమార్తె మరణానికి సంబంధించి వైద్యురాలు తప్పుడు నివేదిక ఇచ్చిందని సతారా జిల్లాకు చెందిన ఒక మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్జేడీకి బిగ్ షాక్ తగిలింది. ఆర్జేడీ రాష్ట్ర మహిళా విభాగం నాయకురాలు ప్రతిమా కుష్వాహా పార్టీకి గుడ్‌బై చెప్పారు. శనివారం ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.
బీహార్ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. అధికార-ప్రతిపక్ష కూటమిలు నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ చేస్తు్న్నాయి. విమర్శలు-ప్రతి విమర్శలతో వేడి పెంచుతున్నారు. ప్రధాని మోడీ శుక్రవారం.. విపక్ష కూటమి లక్ష్యంగా విమర్శలు గుప్పించగా... తాజాగా ప్రధాని మోడీని టార్గెట్‌గా లాలూ ప్రసాద్ యాదవ్ ప్రతి దాడికి దిగారు.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ కుట్రకు ప్లాన్ చేసిన ఐసిస్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను శుక్రవారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని సాదిక్ నగర్‌కు చెందిన ఎండీ అద్నాన్ ఖాన్, అలియాస్ అబూ ముహారిబ్ (19), భోపాల్‌కు చెందిన అద్నాన్ ఖాన్ అలియాస్ అబూ మొహమ్మద్ (20) అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు
మహారాష్ట్రలో ఓ మహిళా వైద్యురాలి (26) ఆత్మహత్య సంచలనంగా మారింది. సతారా జిల్లా ఆస్పత్రిలోనే వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసిపెట్టింది. ఎస్ఐ గోపాల్ బడ్నే తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని ఆరోపించింది.
ఒసామా బిన్ లాడెన్.. అగ్ర రాజ్యం అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు మరిచిపోలేని పేరు. 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై అల్‌ఖైదా ఉగ్రవాదులు జరిగించిన మారణహోమంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్ర కుట్రకు సూత్రధారి అయిన లాడెన్ కోసం అమెరికా దళాలు అవిశ్రాంతిగా పోరాటం చేశాయి.
వెనిజులా ప్రజాస్వామ్య ఉద్యమానికి మహాత్మాగాంధీనే ప్రేరణ అని 2025 నోబెల్ శాంతి గ్రహీత మరియా కొరినా మచాడో అన్నారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ‘‘శాంతి అంటే బలహీనత కాదు.. మహాత్మా గాంధీ మానవత్వం అంటే ఏమిటో చూపించారు.’’ అని మచాడో అన్నారు.
బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. దీపావళి తర్వాత రెండు రోజులు తగ్గినట్టే తగ్గే మళ్లీ పరుగులు పెడుతోంది. దీంతో గోల్డ్ లవర్స్ బెంబేలెత్తిపోతున్నారు. ఇక రెండ్రోజుల పాటు స్వల్పంగా పెరిగిన ధరలు.. శనివారం మాత్రం భారీగా పెరిగిపోయాయి. తులం గోల్డ్‌పై రూ.1,250 పెరగగా.. వెండి ధర మాత్రం ఉపశమనం కలిగించింది.