కర్నూలులో ఘోర బస్సు ప్రమాదాన్ని మరువక ముందే మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో బస్సు హైటెన్షన్ వైర్ తాకి మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో మంటలు వ్యాపించి బస్సు దగ్ధమైంది.
కెనడాలో దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన అమన్‌ప్రీత్ అనే మహిళ (27) దారుణ హత్యకు గురైంది. లింకన్‌లోని ఒక పార్కులో అమన్‌ప్రీత్ సైని మృతదేహం లభ్యమైంది. గాయాలతో మృతదేహం లభ్యమైనట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుడు భారతదేశానికి పారిపోయాడని చెప్పారు.
బీహార్ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. అన్ని పార్టీలు నువ్వానేనా? అన్నట్టుగా దూకుడుగా వెళ్తున్నాయి. ఇక బీహార్ ఎన్నికల వేళ జాన్ సూరాజ్ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీకి కీలక సలహా ఇచ్చారు.
టెక్నాలజీ పెరిగే కొద్దీ.. మనిషి క్రూరత్వం కూడా పెరుగుతోంది. సమాజం ఏమనుకుంటుందోనన్న ఇంకిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇదంతా ఎవరి కోసమంటారా? దేశ రాజధాని ఢిల్లీలో తనపై యాసిడ్ దాడి జరిగిందంటూ ఒక డిగ్రీ విద్యార్థిని హల్చల్ చేసింది.
బీహార్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలకు ఇక వారం రోజులే మిగిలుంది. ఇంకోవైపు రాష్ట్రంలో ఛత్ పండుగ సందడి సాగుతోంది. రాష్ట్రమంతా కోలాహలంగా ఉంది. ఈరోజుతో ఛత్ పండుగ ముగియనుంది. ఇక ఓట్ల పండుగ ప్రారంభం కానుంది.
ఛత్ పండుగ. దేశంలో ఆయా రాష్ట్రాల్లో ఎంతో గ్రాండ్‌గా నిర్వహించే ఫెస్టివల్. అక్టోబర్ 25న ప్రారంభమైన ఈ పండుగ మంగళవారంతో ముగుస్తుంది. ఈరోజు ఛత్ పూజ నిర్వహించనున్నారు. ఉదయం నుంచే సూర్య నమస్కారాలు చేస్తూ.. నేవైద్యాలు సమర్పిస్తున్నారు.
పశ్చిమ టర్కీలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. ఇస్తాంబుల్, బుర్సా, మనీసా, ఇజ్మీర్ ప్రావిన్సుల్లో భూకంపం సంభవించింది. ప్రకంపనలు కారణంగా పలు భవనాలు కూలిపోయాయి. మూడు భవనాలు కూలిపోయాయని అధికారులు తెలిపారు. అయితే ప్రాణనష్టంపై మాత్రం ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇష్టపడుతున్నట్లు వెల్లడించారు. గతంలో కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మలేషియా పర్యటనలో ఉన్న ఆయన మరోసారి ఈ విషయాన్ని ప్రస్తావించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్‌తో ముడి పడి ఉందని బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ల అజెండా మజ్లిస్‌ను పెంచి పోషించడమే. డబ్బు కుమ్మరించడంలో రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి.