Kanpur: కాన్పూర్‌లో దారుణం.. లా విద్యార్థిపై మూకుమ్మడి దాడి.. కడుపు కోసి.. వేళ్లు నరికివేత
- కాన్పూర్‌లో దారుణం
- లా విద్యార్థిపై మూకుమ్మడి దాడి
- కడుపు కోసి.. వేళ్లు నరికివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం జరిగింది. 22 ఏళ్ల లా విద్యార్థిపై మెడికల్ షాపు నిర్వాహకులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. విద్యార్థి కడుపు కోసి.. వేళ్లు నరికివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని బాధిత విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Doctor Suicide Case: వైద్యురాలి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
అభిజీత్ సింగ్ చందేల్(22) కాన్పూర్ విశ్వవిద్యాలయంలో మొదటి సంవత్సరం న్యాయ విద్యను అభ్యషిస్తున్నాడు. మందుల కోసం ఒక మెడికల్ షాపుకు వెళ్లాడు. అయితే మందుల విషయంలో మెడికల్ షాపు అటెండెంట్ అమర్ సింగ్‌తో వాగ్వాదం చోటుచేసుకుంది. క్రమక్రమంగా అది తీవ్ర ఘర్షణకు దారి తీసింది. అమర్ సింగ్, అతడి సోదరుడు విజయ్ సింగ్, మరో ఇద్దరు ప్రిన్స్ రాజ్ శ్రీవాస్తవ, నిఖల్ అనే మొత్తం నలుగురు వ్యక్తులు.. అభిజీత్ సింగ్ చందేల్‌పై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. పదునైన ఆయుధంతో అభిజీత్ కడుపు కోయడంతో పాటు చేతి వేళ్లు నరికివేశారు.
ఇది కూడా చదవండి: Vitamin D Tablets: విటమిన్ డి ట్యాబ్లెట్స్‌తో మూత్రపిండాలకు ఎఫెక్ట్!
తీవ్ర రక్తస్రావం కారణంగా అభిజీత్ నేలపై కుప్పకూలిపోయాడు. అనంతరం ప్రాణాలు కాపాడాలంటూ అరుస్తూ ఒక ఇంటి వైపు పరిగెత్తాడు. దుండగులు మళ్లీ వెంటపడి చేతిలోని రెండు వేళ్లను నరికేశారు. అభిజీత్ అరుపులు విన్న స్థానిక ప్రజలు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. దీంతో దుండగులు పారిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని అభిజీత్‌ను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడికి 14 కుట్లు పడ్డాయని.. పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
బాధితుడి తల్లి నీలం సింగ్ చందేల్ మాట్లాడుతూ.. ‘‘నిందితులు.. పోలీసులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారని, అదే రాత్రి తనపై, గాయపడిన తన కొడుకుపై తప్పుడు దోపిడీ కేసు నమోదు చేశారు.’’ అని ఆమె తెలిపింది. ‘‘హత్యకు పాల్పడిన వారిని అరెస్టు చేయడానికి బదులుగా.. పోలీసులు ప్రాణాలతో పోరాడుతున్న నా కొడుకుపై కేసు నమోదు చేశారు.’’ అని వాపోయింది. హత్యాయత్నం ఆరోపణలపై ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఏసీపీ కుమార్ తెలిపారు. నాల్గవ నిందితుడు ప్రిన్స్ శ్రీవాస్తవ పరారీలో ఉన్నాడని.. అతనిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. చౌహాన్ ఫిర్యాదు ఆధారంగా చందేల్‌పై కూడా దోపిడీ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని.. కానీ దారుణమైన దాడి గురించి నిజం బయటపడిన తర్వాత కొత్త కేసు నమోదు చేశామని ఏసీపీ కుమార్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..