పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.. భారతదేశం లక్ష్యంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని వ్యాఖ్యానించారు. తాజాగా పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చర్చలు విఫలమయ్యాయి.
ఉపరాష్ట్రపతి సీపీ.రాధాకృష్ణన్ తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తొలిసారి సొంత రాష్ట్రంలో రాధాకృష్ణన్ పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన కోసం మంగళవారం కోయంబత్తూరు చేరుకున్నారు. కోయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బీజేపీ నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు.
ఈ ప్రకృతిలో తల్లి, బిడ్డల ప్రేమ వర్ణించలేనిది. జంతువుల్లోనైనా.. మానవ జాతిలోనైనా పేగు బంధం అపురూపమైనది. ఇది మాటల్లో వర్ణించలేనిది. ఈ సృష్టిలో అంత అద్భుతమైంది ఈ బంధం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం వెంటాడుతోంది. గాలి నాణ్యత కోల్పోవడంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాయు కాలుష్య నియంత్రణ కోసం కృత్రిమ వర్షాన్ని కురిపించాలని ఢిల్లీ ప్రభుత్వం పూనుకుంది. ఇందుకోసం రూ.3.21 కోట్లు కేటాయించింది.
ఆసియా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా ఉత్సాహంగా గడుపుతున్నారు. 79 ఏళ్ల వయసులో ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఐదు రోజుల ఆసియా పర్యటనలో భాగంగా సోమవారం మలేసియాకు వచ్చారు. కౌలాలంపూర్ విమానాశ్రయంలో దిగగానే స్థానిక కళాకారులు డాన్స్‌తో స్వాగతం పలికారు.
గాజా శాంతి ఒప్పందం మళ్లీ గాడి తప్పింది. ఈజిప్టు వేదికగా ట్రంప్ ఆధ్వర్యంలో జరిగిన గాజా శాంతి ఒప్పందం కొద్దిరోజులకే నీరుగారిపోయింది. శాంతి ఒప్పందం జరిగిన కొద్ది గంటలకే గాజాపై దాడులు జరిగాయి.
కెన్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున క్యాలే కౌంటీలోని డయాని నుంచి కిచ్వా టెంబోకు వెళ్తున్న తేలికపాటి విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. పర్యాటకులతో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. టూరిస్టుల సహా 12 మంది మృతి చెందారు.
మహారాష్ట్రలో వైద్యురాలి మరణాన్ని మరువక ముందే మరో అబల బలైపోయింది. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మహిళలపై దారుణాలు ఆగడం లేదు. ఎక్కడొక చోట వేధింపులకు నారీమణులు బలైపోతున్నారు. ముంబైలో తొలి వివాహ వార్షికోత్సవానికి ముందు మహిళ మృతి చెందింది.
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన వైద్యురాలి ఆత్మహత్య కేసులో రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషించారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. బీహార్ ఎన్నికల వేళ అన్నదాతల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఫర్టిలైజర్ సబ్సిడీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.రూ.3,000 కోట్ల రూపాయల సబ్సిడీకి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.