ప్రముఖ భారతీయ ప్రకటనల సృష్టికర్త పియూష్ పాండే (70) కన్నుమూశారు. శుక్రవారం ప్రముఖ అడ్వర్టైజింగ్ లెజెండ్ పియూష్ పాండే చనిపోయినట్లుగా స్నేహితులు వెల్లడించారు. 2014 ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ కోసం రూపొందించిన ‘‘అబ్ కీ బార్.. మోడీ సర్కార్’’ అనే నినాదం మార్మోగింది. ఈ నినాదంతో పియూష్ పాండే గుర్తింపు పొందారు. అప్పట్లో ఈ రాజకీయ నినాదం చాలా పాఫులర్ అయింది.
పసిడి ప్రియులకు మళ్లీ షాక్. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. రెండు రోజులు పాటు పరుగులకు బ్రేక్‌లు పడ్డాయి. ధరలు తగ్గుముఖం పడతాయని అంతా భావించారు. కానీ రెండు రోజులకే మళ్లీ ధరలు షాకిచ్చాయి. శుక్రవారం స్వల్పంగా ధరలు పెరిగాయి. తులం గోల్డ్‌పై రూ.380 పెరగగా.. వెండి ధర మాత్రం ఉపశమనం కలిగిస్తుంది.
మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. క్షణికావేశంలో ఒక మహిళా వైద్యురాలు ఆస్పత్రిలోనే ప్రాణాలు తీసుకుంది. సతారాలోని జిల్లా ఆస్పత్రిలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కేరళలో పినరయి విజయన్ ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించింది. పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం అనుసరించిన విధానాలు విజయవంతమయ్యాయి. దీంతో ‘‘అత్యంత పేద రహిత రాష్ట్రం’’గా కేరళ అవతరించింది. ఈ మేరకు నవంబర్ 1న కేరళ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారికంగా ప్రకటించనున్నారు. సినీ తారలు మమ్ముట్టి, మోహన్ లాల్, కమల్ హాసన్ సమక్షంలో ఈ ప్రకటన చేయనున్నారు.
దుబాయ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. గోల్డెన్ వీసా కలిగి ఉన్న 18 ఏళ్ల భారతీయ విద్యార్థి వైష్ణవ్ కుమార్ గుండెపోటుతో మృతిచెందాడు. దీపావళి రోజునే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం వేధిస్తోంది. దీపావళి దగ్గర నుంచి పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి. గాలి నాణ్యత పూర్తిగా కోల్పోయింది. దీంతో కాలుష్య నివారణ కట్టడికి రేఖా గుప్తా ప్రభుత్వం పూనుకుంది.
ఇజ్రాయెల్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే మా మద్దతు మొత్తాన్ని కోల్పోతారని ఇజ్రాయెల్‌కు అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వార్నింగ్ ఇచ్చారు. ఇది చాలా తెలివి తక్కువ పని అంటూ జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు.
ప్రధాని మోడీ శుక్రవారం బీహార్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న గ్రహీత కర్పూరి ఠాకూర్ గ్రామం సమస్తిపూర్ నుంచి మోడీ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. తొలుత కర్పూరి ఠాకూర్‌కు మోడీ నివాళులర్పించనున్నారు.
ప్రధాని మోడీ శుక్రవారం బీహార్‌లో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు. అయితే ఎన్నికల ప్రచారాన్ని దివంగత మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న కర్పూరి ఠాకూర్ గ్రామం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.