Machado: వెనిజులా ఉద్యమానికి మహాత్మాగాంధీనే ప్రేరణ.. నోబెల్ గ్రహీత మచాడో వెల్లడి
- వెనిజులా ఉద్యమానికి మహాత్మాగాంధీనే ప్రేరణ
- నోబెల్ శాంతి గ్రహీత మచాడో వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెనిజులా ప్రజాస్వామ్య ఉద్యమానికి మహాత్మాగాంధీనే ప్రేరణ అని 2025 నోబెల్ శాంతి గ్రహీత మరియా కొరినా మచాడో అన్నారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ‘‘శాంతి అంటే బలహీనత కాదు.. మహాత్మా గాంధీ మానవత్వం అంటే ఏమిటో చూపించారు.’’ అని మచాడో అన్నారు. గాంధీ ప్రేరణతో రెండు దశాబ్దాలుగా వెనిజులాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పోరాడినట్లు చెప్పారు.
‘‘శాంతియుతంగా ఉండటం బలహీనత కాదు. మహాత్మా గాంధీ మానవాళికి దాని అర్థం ఏమిటో చూపించారు. కచ్చితంగా శాంతిని పొందాలంటే మీకు స్వేచ్ఛ అవసరం. స్వేచ్ఛను పొందాలంటే మీకు బలం అవసరం. నైతిక, ఆధ్యాత్మిక శారీరక బలం’’. అని అన్నారు.
Also Read
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
ఇది కూడా చదవండి: Gold Rates: మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
వెనిజులా ప్రపంచంలోనే అత్యంత సంఘటిత సమాజాల్లో ఒకటి అని ఆమె పేర్కొన్నారు. భారతదేశాన్ని గొప్ప ప్రజాస్వామ్య దేశంగా అభివర్ణించారు. ఇతర దేశాలకు భారతదేశం ఉదాహరణ అని ప్రశంసించారు. భారతదేశాన్ని గొప్ప మిత్రదేశంగా చూస్తానని చెప్పారు. అందుకే ‘‘భారతదేశాన్ని నా హృదయపూర్వకంగా ఆరాధిస్తాను.’’ అని మచాడో అన్నారు. ‘‘నా కుమార్తె రెండు నెలల క్రితం భారత్‌కు వచ్చింది. కానీ నేను ఎప్పుడూ భారతదేశానికి వెళ్లలేదు. నా కుమార్తె భారతదేశాన్ని ప్రేమిస్తుంది. నాకు అక్కడ నివసించే చాలా మంది వెనిజులా స్నేహితులు ఉన్నారు. అయితే నేను భారత రాజకీయాలను అనుసరిస్తాను. ప్రధాన మంత్రి మోడీతో మాట్లాడే అవకాశం నాకు లభిస్తుందని ఆశిస్తున్నాను.’’ అని మచాడో అన్నారు.
ఇది కూడా చదవండి: UN: జమ్మూకాశ్మీర్ ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగమే.. యూఎన్‌లో భారత్ స్పష్టీకరణ
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో మోరోస్‌కు వ్యతిరేకంగా మచాడో పోరాటం చేస్తున్నారు. దీంతో మచాడోకు నార్వేజియన్ నోబెల్ కమిటీ.. 2025 నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేసింది. ప్రతిపక్ష నాయకురాలు మచాడో చాలా కాలంగా ‘‘బుల్లెట్లపై బ్యాలెట్లు’’ కోసం పోరాడుతోంది. వ్యక్తిగత ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజాస్వామ్య సంస్కరణల కోసం నిలబడి పోరాటం చేస్తోంది.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..