దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దందాను డీఆర్ఐ అధికారులు గుట్టు రట్టు చేశారు. డ్రగ్స్ తయారు చేసే పరిశ్రమపై అధికారుల బృందం దాడులు చేశాయి. రూ.108 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. మెహ్రౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్కౌంటర్ జరిగింది. ఉదయం 4 గంటలకు పోలీసులకు-వాంటెడ్ క్రిమినల్ కోకు పహాడియా మధ్య కాల్పులు జరిగాయి. మొదట నేరస్థుడు కాల్పులు జరపగా.. అనంతరం పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు.
జమ్మూకాశ్మీర్ ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగమేనని ఐక్యరాజ్యసమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ తెలిపారు. 80వ ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగ చర్చ సందర్భంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పర్వతనేని హరీష్ ప్రసంగిస్తూ పాకిస్థాన్‌పై ధ్వజమెత్తారు.
బీహార్‌లో ప్రస్తుతం ఓట్ల పండుగ జరుగుతోంది. తాజాగా ఓట్ల పండుగతో పాటు తరతరాలుగా ఆచారంగా వస్తున్న ఛత్ ఫెస్టివల్ కూడా వచ్చేసింది. దీంతో రాష్ట్రమంతటా సందడి.. సందడి వాతావరణం.. కోలాహలం కనిపిస్తోంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఛత్ పండుగ జరగనుంది.
అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. వాషింగ్టన్ డీసీలోని హోవార్డ్ యూనివర్సిటీలో దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. శుక్రవారం రాత్రి 8:23 గంటల సమయంలో ఈ కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరి దర్యాప్తు చేపట్టారు. దుండగుల కోసం గాలిస్తున్నారు.
మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌ను ప్రకటించిన తర్వాత ఎన్డీఏ కూటమి వైఖరిలో కూడా మార్పు కనిపిస్తోంది. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
మహాఘట్బంధన్లో ఉన్నవారంతా నేరస్థులేనని.. వారంతా బెయిల్‌పై తిరుగుతున్నారని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. శుక్రవారం ప్రధాని మోడీ బీహార్‌లోని సమస్తిపూర్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం అయింది. ఐసిస్ ఉగ్రవాదులు భారీ కుట్రకు ప్లాన్ చేసినట్లుగా ఢిల్లీ స్పెషల్ పోలీసులు గుర్తించారు. దీంతో మధ్యప్రదేశ్‌లో ఒకరు.. సౌత్ ఢిల్లీలో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఈడీ బాంబులను తయారు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
ప్రధాని మోడీ బీహార్‌లో ఎన్నికల శంఖారావం పూరించారు. శుక్రవారం ఉదయం భారతరత్న కర్పూరి ఠాకూర్ స్వగ్రామం సమస్తిపూర్‌కు చేరుకున్నారు. ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పలకరించారు. అటు తర్వాత సమస్తిపూర్ నుంచి ఎన్నికల ర్యాలీని మోడీప్రారంభించారు. మోడీ వెంట ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీజేపీ నేతలు ఉన్నారు.