ఒసామా బిన్ లాడెన్.. అగ్ర రాజ్యం అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు మరిచిపోలేని పేరు. 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై అల్‌ఖైదా ఉగ్రవాదులు జరిగించిన మారణహోమంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్ర కుట్రకు సూత్రధారి అయిన లాడెన్ కోసం అమెరికా దళాలు అవిశ్రాంతిగా పోరాటం చేశాయి. ఎట్టకేలకు దశాబ్ద కాలం తర్వాత అనగా 2011, మే 2 అర్ధరాత్రి పాకిస్థాన్‌లో లాడెన్‌ను అమెరికా దళాలు అంతమొందించాయి.
ఈ ఆపరేషన్‌కు సంబంధించిన కీలక విషయాలను 15 ఏళ్ల పాటు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్స్‌లో పని చేసిన మాజీ అధికారి జాన్ కిరియాకౌ ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
సెప్టెంబర్ 11, 2001లో 19 మంది అల్‌ఖైదా ఉగ్రవాదులు నాలుగు విమానాలను హైజాక్ చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై నాలుగు జట్లుగా విడిపోయి దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో దాదాపు 3,000 వేల మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. ఇది అమెరికా చరిత్రలోనే అతి పెద్ద ఉగ్రవాద చర్య. ప్రపంచ దేశాలను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది.
ఇది కూడా చదవండి: Machado: వెనిజులా ఉద్యమానికి మహాత్మాగాంధీనే ప్రేరణ.. నోబెల్ గ్రహీత మచాడో వెల్లడి
అనంతరం ఉగ్రవాదుల కోసం అమెరికా దళాలు వేట ప్రారంభించాయి. నెల రోజుల తర్వాత ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్ర స్థావరాలను గుర్తించినట్లుగా జాన్ కిరియాకౌ తెలిపారు. ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి నెల రోజులు అవగాహన పెంచుకున్నట్లు చెప్పారు. ఆవేశంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని భావించామని.. అవగాహన వచ్చిన తర్వాత ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు వివరించారు. లాడెన్‌ను లొంగిపోవాలని ట్రాన్స్‌లేటర్ ద్వారా సందేశం పంపించామని.. అయితే పిల్లల్ని, మహిళలను తరలించడానికి ట్రాన్స్‌లేటర్ ద్వారా కొంత సమయం అడిగినట్లు తెలిపారు. అయితే ఆ ట్రాన్స్‌లేటర్ కూడా అల్‌ఖైదాకు చెందిన వాడని తర్వాత అర్థమైందని.. అతడు అమెరికా సైన్యంలోకి చొరబడిన అల్ ఖైదా కార్యకర్త అని జాన్ కిరియాకౌ చెప్పుకొచ్చారు. అయితే లాడెన్‌కు లొంగిపోయేందుకు సమయం ఇవ్వాలని ట్రాన్స్‌లేటర్ జనరల్ ఫ్రాంక్స్‌ను తీవ్రంగా ఒప్పించాడని.. దీంతో పారిపోయేందుకు లాడెన్‌కు సమయం దొరకగానే ఆడ వేషం వేసుకుని పికప్ ట్రక్కు వెనుక నక్కి పాకిస్థాన్‌లోకి పారిపోయాడని చెప్పుకొచ్చారు. దీంతో మా పోరాటం పాకిస్థాన్ వైపు మళ్లించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఎట్టకేలకు దశాబ్ద కాలం తర్వాత అనగా 2011, మే 2న అర్ధరాత్రి అబోటాబాద్ శివారులో రహస్యంగా తలదాచుకున్న లాడెన్‌ను గుర్తించి అమెరికా దళాలు హతమార్చినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Delhi Encounter: ఢిల్లీలో మరో ఎన్‌కౌంటర్.. పోలీసుల అదుపులో నిందితుడు
ఇక 2001లో భారత పార్లమెంట్‌పై జరిగిన దాడితో అణ్వాయుధాలు కలిగిన భారత్-పాక్ యుద్ధానికి దిగుతాయని సీఐఏ భావించిందని జాన్ కిరియాకౌ గుర్తుచేసుకున్నారు. అయితే భారత్‌తో జరిగే ఎలాంటి యుద్ధంలో అయినా పాక్ ఓడిపోతుందని పేర్కొన్నారు. భారతీయులను నిరంతరం రెచ్చగొట్టడం వల్ల ఎలాంటి లాభం లేదని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్ కిరియాకౌ ఈ విధంగా వ్యాఖ్యానించారు.