ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు అదనపు సాధారణ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని నాలుగో సంవత్సరం లా విద్యార్థి గురువారం ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశాడు.
హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌ను ఇంటికి పంపించాలని గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు తరపున గోవా సీఎం ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
చాలా రోజులు తర్వాత కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా తాగు నీటితో ప్రజలు సతమతం అవుతున్నారు
ఐపీఎల్ టికెట్ల విక్రయాల్లో జరుగుతున్న అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి, దోషులపై చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) బోర్డ్ అవినీతి, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ నియమించి విచారణ జరపాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కె. ధర్మేంద్రలు డిమాండ్ చేశారు.
సార్వత్రిక ఎన్నికల వేళ బాలీవుడ్ నటులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రముఖ నటులు ఆయా పార్టీలకు ప్రచారం చేస్తున్నట్లు డీప్‌ఫేక్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
పశ్చిమాసియాలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని దుస్థితి నెలకొంది. ఇప్పటికే గాజా-ఇజ్రాయెల్ యుద్ధంతో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. అన్ని పార్టీలు హేమాహేమీలైన అభ్యర్థులను బరిలోకి దింపాయి. అయితే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో శ్రీకళారెడ్డి అనే మహిళ పోటీ చేస్తోంది.