దేశ వ్యాప్తంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అవుతున్న వేళ దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలని, దీనిలో ఎలాంటి అనుమానాలకు తావివ్వొద్దని సుప్రీంకోర్టు తెలిపింది.
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే సందేశ్‌ఖాలీ ఘటనతో మమతా బెనర్జీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు పాలైంది.
సార్వత్రిక ఎన్నికల వేళ దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. త్రిలోక్‌పురిలో పలువురు కొట్లాటకు దిగారు. ఈ ఘటనలో పలువురు కత్తిపోట్లకు గురయ్యారు.
సార్వత్రిక ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగలుతున్నాయి. ఇటీవలే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌పై విజిలెన్స్ డిపార్ట్మెంట్ వేటు వేసింది.
నైరుతి జపాన్‌లో భూకంపం సంభవించింది. బుధవారం రాత్రి 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ప్రస్తుతానికి ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. యువాజిమాకు పశ్చిమాన 18 కిలోమీటర్లు లోతులో క్యుషు-షికోకు దీవుల దగ్గర భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అలాగే దక్షిణ జపాన్‌లోని ఎహైమ్, కొచ్చి ప్రిఫెక్చర్లలో కూడా భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. ఇది కూడా చదవండి: Delhi HC: లవ్ ఫెయిల్యూర్‌తో ప్రేమికుడు ఆత్మహత్య చేసుకుంటే, మహిళను […]
డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.
పీఎఫ్ చందాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొత్త ఆర్థిక సంవత్సరం శుభవార్త చెప్పింది. ఇకపై పీఎఫ్ ఖాతాదారులు ఎవరిపై ఆధారపడకుండా వైద్య ఖర్చుల నిమిత్తం ఖాతా నుంచి లక్ష రూపాయల వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించింది.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల జోరు సాగుతోంది. ఏడు విడతల్లో పోలింగ్ జరగుతుండగా.. తొలి విడత శుక్రవారమే ప్రారంభంకానుంది. అయితే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. పోలింగ్‌కి రెండు రోజుల ముందు మేనిఫెస్టోను ప్రకటించారు.
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగమండిపోతున్నాడు. దీంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరోవైపు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు