Madhya Pradesh: ప్రాణాలు తీసిన డీజే.. డ్యాన్స్ చేస్తూ 13 ఏళ్ల బాలుడు మృతి
- ప్రాణాలు తీసిన డీజే
- డ్యాన్స్ చేస్తూ 13 ఏళ్ల బాలుడు మృతి
- మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య సమాజంలోకి పాడు సంస్కృతి ప్రవేశించింది. ఉల్లాసమైనా, ఆనందమైనా పరిధిలో ఉండాలి. అది శృతిమించితే దు:ఖమే మిగులుతుంది. ఇప్పుడు ఏ శుభకార్యం జరిగినా.. ఏ పండుగ వచ్చినా మొట్టమొదటిగా గుర్తొచ్చేది డీజే సౌండే. ఏ చిన్న కార్యక్రమం జరిగినా నిర్వాహకులు డీజే సౌండ్‌నే బుక్ చేస్తున్నారు. కానీ దాని ప్రభావం కొందరి కుటుంబాల్లో విషాదం నింపుతుందన్న విచక్షణ ఎవరికీ ఉండడం లేదు. ఏ శబ్దమైనా లిమిట్‌లోనే ఉండాలి. అంతకు మించితే ప్రాణాలే పోతాయి. ఇదంతా ఎందుకుంటారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఇది కూడా చదవండి: Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్స్‌ని అప్పగించాలని కోరాం, కెనడా స్పందించలేదు: భారత్..
Also Read
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
- Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో స్థానిక పండుగ జరుగుతోంది. ఈ వేడుకలో నిర్వాహకులు డీజే సౌండ్ ఏర్పాటు చేశారు. అందరూ ఉత్సాహంగా కేరింతలు కొడుతూ గంతులు వేస్తున్నారు. అక్కడే ఉన్న సమర్ బిల్లోర్ అనే బాలుడి(13)కి కూడా ఊపు వచ్చింది. ఏ మాత్రం ఆలస్యంగా చేయకుండా వారి మధ్యలోకి దూరి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నాడు. అయితే డీజే సౌండ్‌కి బాలుడి గుండె తట్టుకోలేకపోయింది. అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఇంత జరిగినా మిగతా వారు డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. బాలుడి తల్లి గమనించి.. సౌండ్ ఆపమని ప్రాధేయపడినా ఎవరూ పట్టించుకోలేదు. వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. డీజే సౌండ్ కారణంగా గుండె పోటు వచ్చి ప్రాణాలు పోయాయని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
డీజే సౌండ్ ఎక్కువగా ఉండడంతోనే తన కొడుకు ప్రాణాలు పోయాయని సమర్ తండ్రి కైలాష్ బిల్లోర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన కొడుకు మృతికి డీజేనే కారణమని ఆరోపించాడు. ఎన్నిసార్లు హెచ్చరించినా ఆగలేదని, తమ అబ్బాయి ప్రాణం పోయినా ఆ సందడిని ఏదీ ఆపలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పండుగల సమయంలో ఇలాంటి సౌండ్ సిస్టమ్స్ నుంచి వచ్చే పెద్ద పెద్ద శబ్దాల కారణంగా ఇంట్లోని రోగులు, పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయాడు.
ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో డీజే సౌండ్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో నగరంలో డీజే సౌండ్‌ను పోలీసులు నిషేధం విధించారు. డీజే సౌండ్ కారణంగా పిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అనారోగ్యం పాలవుతున్నారు. దీంతో హైదరాబాద్ సీపీ సీవీ. ఆనంద్ .. డీజేను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: ఇంతకంటే మంచి సమయం లేదు.. రాష్ట్రంలో పెట్టుబడులకు సీఎం చంద్రబాబు ఆహ్వానం
తాజావార్తలు
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!