Delhi: గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల బదిలీలకు సన్నాహాలు! ఏఏ రాష్ట్రాలంటే..!
- గవర్నర్లు.... లెఫ్టినెంట్ గవర్నర్ల బదిలీలకు సన్నాహాలు!
- నవంబర్‌లో మార్పులు జరిగే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల బదిలీలకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో పలు రాష్ట్రాల గవర్నర్ల బదిలీలు ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. మూడు నుంచి ఐదు సంవత్సరాలకు పైగా పని చేసిన గవర్నర్లను బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్, కేరళ.. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, అండమాన్ నికోబార్ దీవులు, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలలో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు మారనున్నారు. జమ్మూ కశ్మీర్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్నారు. ఈయనను కూడా బదిలీ చేసే అవకాశం ఉంది.
బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ను జమ్మూకాశ్మీర్‌కు పంపిచే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తు్నాయి. ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఐదు ఏళ్లకుపైగా కేరళ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు కూడా వేరే పదవి ఇచ్చే అవకాశం ఉంది. అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ దేవేంద్ర కుమార్ జోషి పదవీ విరమణ చేయొచ్చని సమాచారం.
Also Read
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
ఇక హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా మూడేళ్లకు పైగా పదవీకాలం పూర్తి చేసుకున్నారు. అలాగే మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ సి పటేల్, ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్‌కు సంబంధించి 3 ఏళ్ల పదవీ కాలం పూర్తయింది. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఐదేళ్లు… తమిళనాడు ఆర్‌ఎన్ రవి, గోవా పీఎస్ శ్రీధరన్ పిళ్లై మూడేళ్లుగా గవర్నర్ పదవిలో ఉన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పునర్వ్యవస్థీకరణ జరగవచ్చని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయని సీనియర్ బీజేపీ నేతలను గవర్నర్ లేదా ఎల్‌జీలుగా నియమించే అవకాశం ఉంది. మాజీ ఎంపీలు అశ్వనీ చౌబే, వీకే సింగ్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ జాబితాలో ఉన్నారు.
తాజావార్తలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!