Maharashtra: ఇండియా కూటమిలో సీట్ల పంచాయితీ.. ఎస్పీకి 12 సీట్లు ఇవ్వాలంటూ ఎక్స్‌లో పోస్టు
- ఇండియా కూటమిలో సీట్ల పంచాయితీ
- మహారాష్ట్రలో ఎస్పీకి 12 సీట్లు ఇవ్వాలంటూ ఎక్స్‌లో పోస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైంది. అన్ని పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తు్న్నాయి. వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇంకోవైపు అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. మరోసారి అధికారం కోసం ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేస్తుంటే.. అధికారం చేజిక్కించుకోవాలని ఇండియా కూటమి అడుగులు వేస్తోంది. ఇలా ఆయా పార్టీలు గెలుపే లక్ష్యంగా మేథోమథనం చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: GOAT: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటానంటున్న డైరెక్టర్
Also Read
- INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో సీట్లు పంచాయితీ నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇండియా కూటమిలో ఇలానే సీట్ల రగడ నడిచింది. దీంతో ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయడంతో తగిన మూల్యమే చెల్లించుకున్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు వచ్చాయి. ప్రస్తుతం మహా వికాస్ అఘాడిలో సీట్ల పంపకాలపై చర్చలు నడుస్తు్న్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సమాజ్‌వాదీ పార్టీ అధినేత అబు అజ్మీ ఎక్స్ ట్విట్టర్ వేదికగా పెట్టిన పోస్టు రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇండియా కూటమిలో భాగంగా ఎస్పీకి 12 సీట్లు కేటాయించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. సీట్ల పంపకాలపై చర్చలు నడుస్తున్న సమయంలో గుర్తు చేయడానికే పోస్టు పెట్టినట్లు ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి: Hyderabad: యువకుడి రాష్ డ్రైవింగ్.. అడ్డుకున్న వృద్ధుడిని కొట్టి చంపిన వైనం
అబు అజ్మీ మాట్లాడుతూ… ‘‘ప్రస్తుతం కాంగ్రెస్, ఎన్‌సీపీ-ఎస్‌సీపీ, శివసేన (యుబిటి) మాత్రమే సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఇతర చిన్న పార్టీలతో సమావేశాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. చాలా ఆలస్యం అవుతుందని నేను నా ట్వీట్ ద్వారా వారికి గుర్తు చేస్తున్నాను. నేను విన్నాను. కాంగ్రెస్ కూడా ఏదో ఒకటి ప్రకటించబోతోంది కాబట్టి మమ్మల్ని విశ్వాసంలోకి తీసుకోవాలని నేను వారికి చెప్పాను. ఇందులో ఎలాంటి ఆగ్రహం లేదు. రాహుల్ గాంధీ మరియు అఖిలేష్ యాదవ్ మధ్య సంబంధాలు కూడా బాగానే ఉన్నాయని నేను గుర్తు చేయాలనుకుంటున్నాను.’’ అని ఆయన ట్వీట్ చేశారు. ‘‘నేను కూటమి నుంచి 12 సీట్లు అడుగుతున్నాను. నేను చాలా సీట్లు సాధించడానికి ప్రయత్నిస్తాను.’’ అని అబు అజ్మీ పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీతో మాట్లాడకుండా అభ్యర్థిని ప్రకటిస్తే తప్పు అని అభిప్రాయపడ్డారు.
‘‘నేను రేపు మహారాష్ట్రకు వెళ్తున్నాను. మా ప్రయత్నం భారత కూటమితో కలిసి పోటీ చేయడమే. మేము సీట్లు అడిగాము. మాకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు ఎక్కువ సీట్లు వస్తాయని మేము ఆశిస్తున్నాము.’’ అని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు.
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న ఒకే దశలో జరగనున్నాయి. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయి. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి (MVA) సంకీర్ణంలో భాగంగా కాంగ్రెస్ మరియు ఏకీకృత శివసేన 288 సీట్లలో 154 గెలుచుకున్నాయి. అయితే ఈసారి బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిని ఎదుర్కోవడానికి శివసేన (యూబీటీ), శరద్ పవార్‌కి చెందిన ఎన్‌సీపీ, కాంగ్రెస్‌లు పొత్తు పెట్టుకున్నాయి. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 48 లోక్‌సభ స్థానాల్లో 30 స్థానాలను ఎంవీఏ గెలుచుకుంది. అధికార కూటమికి 17. ఒక సీటు స్వతంత్ర అభ్యర్థికి దక్కింది.
ఇది కూడా చదవండి: YS Jagan: జమిలి ఎన్నికలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు