తమిళనాడులో దారుణం జరిగింది. ఒక వ్యక్తిని నడిరోడ్డుపై ఆరుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా హతమార్చారు. చుట్టుప్రక్కల జనాలు ఉన్నా ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో ముందడుగు వేసింది. దర్యాప్తులలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ 2014-22 మధ్య రూ.7.08 కోట్ల విదేశీ నిధులు పొందినట్లుగా గుర్తించింది.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతికి సంతాపంగా ఐదు రోజుల పాటు జాతీయ సంతాపం దినాలుగా సుప్రీం లీడర్ ఖమేనీ ప్రకటించారు. గత రాత్రి హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారు.
దేశ వ్యాప్తంగా ఐదో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చిన్న చిన్న సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత రాష్ట్రాల్లో 49 స్థానాలకు ఓటింగ్ ముగిసింది.
బాలికపై హత్యాచారం కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. నిందితులకు మరణశిక్ష విధించింది. రాజస్థాన్లోని భిల్లారా జిల్లాలో ఫోక్సో కోర్టు ఈ మరణశిక్ష విధించింది.
ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం జరిగింది. లో కార్మికుల పికప్ వాహనం బోల్తా పడి 15 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారు. దీంతో ఆయన స్థానంలో తాత్కాలిక అధ్యక్షుడిగా మొహమ్మద్ మొఖ్బర్ బాధ్యతలు స్వీకరించారు.