Pune: బాలుడి డ్రైవింగ్‌తో ఇద్దరి మృతి.. 15 గంటల్లో బెయిల్.. కోర్టు ఏం చెప్పిందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని పూణెలో జరిగిన రోడ్డుప్రమాదంపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఆశ్చర్యం కలిగించింది. బాలుడి డ్రైవింగ్ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇద్దరి మృతికి కారణమైన బాలుడికి 15 గంటల్లోనే బెయిల్ లభించడం విశేషం. పైగా ప్రమాదంపై వ్యాసం రాయమని పూణె కోర్టు ఉచిత సలహా ఇచ్చింది. ఈ తీర్పు మేధావుల్ని ఆశ్చర్యం గొల్పించింది.

Also Read
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
పూణెలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్‌ను లగ్జరీ కారు ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. కారు డ్రైవ్ చేసిన నిందితుడు ఓ మైనర్ అని తేల్చారు. దీంతో అతడిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపర్చారు. ఈ కేసులో ఆ బాలుడికి జువైనల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇందుకు కొన్ని షరతులు విధించింది.
ఇది కూడా చదవండి: Fish Prasadam : జూన్ 8న ‘చేప ప్రసాదం’
15 రోజులు ట్రాఫిక్ పోలీసులతో పని చేయాలని.. అలాగే ప్రమాదంపై ఒక వ్యాసం రాయాలని సూచించింది. అంతేకాకుండా మద్యపానంపై చికిత్స చేయించుకోవాలని.. కౌన్సెలింగ్ కూడా తీసుకోవాలని ధర్మాసనం ఉచిత సలహా ఇచ్చింది. భవిష్యత్‌లో ఎవరైనా రోడ్డు ప్రమాదాలకు గురైతే బాధితులకు సాయం చేయాలని సూచించింది. నిందితుడిని మేజర్‌గా పరిగణించి దర్యాప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోరగా.. న్యాయస్థానం అందుకు తిరస్కరించింది. బెయిల్ నిరాకరించడానికి కారణాలు కనిపించడం లేదని కోర్టు ఈ సందర్భంగా పేర్కొన్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. నిందితుడు పూణెకు చెందిన ప్రముఖ రియల్టర్ కుమారుడు కావడం విశేషం.
ఇటీవలే 12వ తరగతి పూర్తి చేసిన ఆ బాలుడు.. శనివారం తన స్నేహితులతో కలిసి పోర్షే కారులో పబ్‌కు వెళ్లాడు. అక్కడ మద్యం కూడా సేవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆదివారం తెల్లవారుజామున 2:15 గంటలకు పబ్ నుంచి తిరిగి వస్తుండగా వాహనం నియంత్రణ కోల్పోయి ఎదురుగా వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల స్వస్థలం రాజస్థాన్ అని పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: AP Violence: డీజీపీని కలిసిన సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్.. అల్లర్లపై నివేదిక అందజేత
తాజావార్తలు
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..