జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీతా సోరెన్‌పై జేఎంఎం అధిష్టానం వేటు వేసింది. ఆమెను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆమెపై ఈ వేటు పడింది.
ఢిల్లీ నుంచి బెంగళూరు బయలుదేరిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ ఛార్జీషీట్ దాఖలు చేసింది. కేజ్రీవాల్‌తో పాటు పార్టీని కూడా ఛార్జీషీటులో చేర్చింది.
మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఎన్నికల సందర్భంగా తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
పూణె ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో సిద్ధమై.. టేకాఫ్ అవుతుండగా విమానం టగ్ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో విమాన మధ్య భాగం భారీగా దెబ్బతింది. పైలట్ల అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం ముక్కు, ల్యాండింగ్ గేర్ దగ్గర టైర్ దెబ్బతిన్నట్లు విమానాశ్రయ అధికారి వెల్లడించారు. పూణె నుంచి ఢిల్లీ వెళ్లేందుకు 180 మంది ప్రయాణికులతో ఎయిరిండియా […]
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఇక మరికొన్ని జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న వెల్లడించారు.
సార్వత్రిక ఎన్నికల వేళ స్వాతి మాలివాల్ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఇటీవల కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారం చల్లారక ముందే ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘటన దేశ రాజకీయాల్ని కుదిపేస్తోంది.