తమిళనాడులో దారుణం జరిగింది. ఒక వ్యక్తిని నడిరోడ్డుపై ఆరుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా హతమార్చారు. చుట్టుప్రక్కల జనాలు ఉన్నా ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. తిరునెల్వేలిలో రద్దీగా ఉండే రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Uber buses : ఇక నుంచి ఉబర్ బస్సులు.. ఎక్కడ ప్రారంభిస్తున్నారో తెలుసా?
తమిళనాడులోని తిరునెల్వేలిలో రద్దీగా ఉండే రోడ్డుపై ఓ వ్యక్తిని అర్థరాత్రి ఆరుగురు వ్యక్తులు నరికి చంపారు. ఈ దాడి ఘటన ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. బాధితుడు దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా పార్కు చేసిన కార్లు గుండా పరుగెత్తాడు. అయినా వెంటపడి కనికరం లేకుండా చంపేశారు. కనీసం 12 సార్లు కత్తులతో నరికారు. జనాలు ఉన్నా దాడిని ఆపడానికి ఎవరూ ముందుకు రాకపోవడం విశేషం. బాధితుడు విగతజీవిగా పడి ఉండడంతో వ్యక్తులు పరారయ్యారు. పాత కక్షలే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Anand Deverakonda: ఫ్యామిలీ స్టార్ నెగిటివిటీ ఆ గ్రూప్ పనే.. ఆనంద్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలిని పరిశీలించారు. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. పాత కక్షలే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. ఇక మృతుడికి సంబంధించిన వివరాలు.. నిందితులతో ఉన్న సత్సంబంధాల గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Bank FD: సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ రేటు అందిస్తున్న బ్యాంకులేవో తెలుసా?