ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారు. దీంతో ఆయన స్థానంలో తాత్కాలిక అధ్యక్షుడిగా మొహమ్మద్ మొఖ్బర్ బాధ్యతలు స్వీకరించారు. మొఖ్బర్‌కు సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా అనుభవజ్ఞుడైన రాజకీయ వ్యక్తిగా పేరుగాంచారు. పాలనలో గణనీయమైన ప్రభావం చూపిన చరిత్ర ఉంది. మొహమ్మద్ మొఖ్బర్ సెప్టెంబరు 1, 1995లో జన్మించారు.. ఇరాన్ రాజకీయ, ఆర్థిక రంగాల్లో బలమైన వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. 2021 ఎన్నికల్లో రైసీ విజయం సాధించడంతో ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.
ఇది కూడా చదవండి: S.V.Madhav Reddy SP: అల్లర్లు సృష్టిస్తే జిల్లా బహిష్కరణ, కఠిన చర్యలు తప్పవు
ఇరాన్ రాజ్యాంగం ప్రకారం సిట్టింగ్ ప్రెసిడెంట్ మరణం తర్వాత మొదటి వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొఖ్బర్(69)కు అవకాశం దక్కింది. తాత్కాలిక హోదాలో ఈ అధ్యక్ష పదవిని చేపట్టారు. మరో 50 రోజుల్లో శాశ్వత అధ్యక్షుడి నియామకం జరుగుతుంది. మొఖ్బర్ గతంలో సెటాడ్ అనే శక్తివంతమైన ప్రభుత్వ యాజమాన్యంలోని ఫౌండేషన్‌కు నాయకత్వం వహించారు. అంతర్జాతీయ చట్టం మరియు నిర్వహణలో అధునాతన డిగ్రీలను కలిగి ఉన్నారు.
ఇది కూడా చదవండి: MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట.. మరోసారి రిమాండ్ పొడిగింపు
గత రాత్రి జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్దోల్లాహియాన్ మరణించారు. ఇరానియన్-అజర్‌బైజానీ సరిహద్దులో క్విజ్ ఖలాసి డ్యామ్ ప్రారంభోత్సవం తర్వాత ఇరాన్ నగరమైన తబ్రిజ్‌కు వెళుతుండగా ఉన్నతాధికారులతో కూడిన విమానం.. దట్టమైన పొగమంచుతో పర్వత భూభాగాన్ని దాటుతుండగా కూలిపోయింది.
ఇది కూడా చదవండి: Tamilnadu : తమిళనాడులో విషాదం.. ట్రోల్స్ తట్టుకోలేక ఐటీ ఉద్యోగి ఆత్మహత్య