గత రెండేళ్లుగా ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం సాగిస్తోంది. ఇప్పటికీ ఇరు దేశాల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. ఇక రెండ్రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ రష్యాలో పర్యటిస్తున్నారు. మంగళవారం ఉక్రెయిన్‌తో యుద్ధం గురించి పుతిన్‌తో మోడీ చర్చించి కీలకమైన సూచన చేశారు.
ప్రధాని మోడీ రెండ్రోజుల పర్యటన నిమిత్తం రష్యా వెళ్లారు. సోమవారం ప్రధాని మోడీకి మాస్కోలో ఘన స్వాగతం లభించింది. మంగళవారం రెండోరోజు పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి మోడీ సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.
రీల్స్ జబ్బు ఆస్పత్రులకు కూడా పాకింది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక యువత రీల్స్ మోజులో పడి ఎక్కడ పడితే అక్కడ షూట్ చేస్తున్నారు. మెట్రో, ఎయిర్‌పోర్టులు, ఈ మధ్య విమానాల్లో కూడా రీల్స్ చేయడం చూశాం.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మంగళవారం ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆప్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 7, 8 అనుబంధ ఛార్జ్సీట్లను దాఖలు చేసింది. ఈ రెండు సప్లిమెంటరీ ఛార్జ్షీట్లను ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
పశ్చిమ బెంగాల్లో మరోసారి బీజేపీ-తృణమూల్ కాంగ్రెస్ మధ్య మినీ సంగ్రామం జరగబోతుంది. బుధవారం నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక జరగనుంది. దీంతో రెండు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి.
గగనతలంలో మరో విమాన ప్రమాదం తప్పింది. ఈ మధ్య వరుసగా విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. నాలుగు నెలల క్రితం విమాన టేకాఫ్ అవుతుండగా అమాంతంగా టైర్ ఊడిపోయి వాహనాలపై పడడంతో కార్లు ధ్వంసం అయ్యాయి.
త్వరలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో అటల్ పెన్షన్ దారులకు శుభవార్త చెప్పే యోచనలో ఉంది. కేంద్రంలో మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడింది. ఈ నెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి ఆల్‌టైమ్ రికార్డులు నమోదు చేశాయి. మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. క్రమం క్రమంగా పుంజుకుంటూ భారీ లాభాల దిశగా ట్రేడ్ అయ్యాయి.
ఉత్తరాఖండ్ స్టేట్ లైసెన్సింగ్ అథారిటీ ఏప్రిల్‌లో తయారీ లైసెన్స్‌లను సస్పెండ్ చేసిన 14 ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసినట్లు పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ మంగళవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.
ఈ మధ్య విమానాల్లో వింత వింత సంఘటనలు జరుగుతున్నాయి. కొందరు ప్రయాణికులు జుగుప్సకరంగా ప్రవర్తిస్తుంటే.. మరికొందరు దాడులకు దిగుతున్నారు. ఇలాంటి ఘటనలతో నిత్యం ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి వార్తల్లో నిలుస్తున్నాయి.