స్టాక్ మార్కెట్ రికార్డుల మోత మోగిస్తున్నాయి. వరుస లాభాలతో జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ప్రతి రోజూ సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డాక.. మార్కెట్లు ఎలా ఉంటాయోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
మహారాష్ట్రలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర పాలిటిక్స్‌ను తలకిందులు చేశాయి. దీంతో అజిత్ వర్గం ఎమ్మెల్యేల్లో అలజడి మొదలైంది.
అక్రమ వలసలపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశించేందుకు క్యూ కడుతున్నారని.. వారంతా లేబర్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వ్యాఖ్యానించారు.
లోక్‌సభలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీకి ప్రమోషన్ లభించింది. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ నియమితులయ్యారు. ఈ మేరకు ఇండియా కూటమి ఎన్నుకున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
పన్ను వ్యతిరేక నిరసనలతో కెన్యా రణరంగంగా మారింది. పార్లమెంట్ ముట్టడికి పెద్ద ఎత్తున ఆందోళనకారులు తరలిరావడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. పోలీసులు, భద్రతా సిబ్బంది నిరసనకారులపై టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగులు, తుపాకీ కాల్పులకు పాల్పడ్డారు.
పన్ను వ్యతిరేక నిరసనలతో కెన్యా అట్టుడికింది. మంగళవారం పార్లమెంట్ కొత్త పన్నుల విధానాన్ని ఆమోదించింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున పార్లమెంట్ ముట్టడికి యత్నించారు.
ప్రముఖ భారత ఫుట్‌బాల్ దిగ్గజం భైచుంగ్ భూటియా రాజకీయాలకు స్వస్తి చెప్పారు. ఇటీవల జరిగిన సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు భైచుంగ్ భూటియా మంగళవారం ప్రకటించారు.
పూణె కారు ప్రమాదం కేసులో మైనర్ నిందితుడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలి అశ్విని కోష్ట తల్లి మమతా కోష్ట దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనతో షాకింగ్‌కు గురైనట్లు తెలిపింది.
ప్రజల ఆందోళనలు, నిరసనలతో కెన్యా పార్లమెంట్ పరిసరాలు అట్టుడికింది. పార్లమెంట్లో కొత్త పన్నుల విధానాన్ని ప్రవేశపెట్టి మంగళవారం ఆమోదించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు.