ముంబై వేదికగా ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జూలై 12న పెళ్లితో అనంత్-రాధిక ఒక్కటి కాబోతున్నారు. అయితే మామేరు వేడుకలతో ముందుగానే అంబానీ నివాసంలో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. రోజుకో కార్యక్రమంతో సందడి సందడగా సాగుతోంది.
జమ్మూకశ్మీర్ కాల్పులతో మర్మోగింది. కుల్గామ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఒక సైనికుడు అమరుడయ్యాడు. శనివారం కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో ఒక సైనికుడు ప్రాణాలు వదిలాడు.
అస్సాంను భారీ వరదలు ముంచెత్తాయి. ఊళ్లు చెరువులయ్యాయి. ఎటు చూసినా నీళ్లే. కాలు కదపలేని పరిస్థితి. ఇంకో వైపు విష పురుగులు, జంతువుల సంచారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇలా 30 జిల్లాల్లో పరిస్థితులు క్లిష్టంగా మారిపోయాయి.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ట్రయల్ కోర్టు పొడిగించింది. జూలై 15 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
తమిళనాడు బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యకు గురయ్యారు. శుక్రవారం పెరంబూర్‌లోని ఆయన నివాసానికి సమీపంలో ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మపై చేసిన వ్యాఖ్యలకు గాను లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రాపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు జాతీయ మహిళా కమిషన్ శుక్రవారం తెలిపింది.
లండన్‌లో జరిగిన ఎన్నికల్లో లేబర్ భారీ ఘనవిజయం నమోదు చేసింది. దాదాపు 400 సీట్లకు పైగా గెలుచుకుంది. దీంతో ప్రధాన మంత్రిగా కీర్ స్టార్మర్ ఎన్నికయ్యారు అలాగే కింగ్ ఛార్లెస్-3 కూడా కీర్ నియామకాన్ని ఆమోదించారు.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాల లిస్టు విడుదల చేసింది.
ఆధారాలు ఉంటే అరెస్టు చేసుకోవాలని ఎన్డీయే ప్రభుత్వానికి సవాల్ విసిరారు. శుక్రవారం ఆర్జేడీ 28వ వార్షికోత్సవం సందర్భంగా పాట్నాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తేజస్వీ మాట్లాడారు.. నితీష్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అవినీతి, నేరాల్ని ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు.
మోడీ ప్రభుత్వంపై ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం మోడీ సర్కార్ బలహీనంగా ఉందని.. ఆగస్టులో కూలిపోవచ్చని జోస్యం చెప్పారు.