గగనతలంలో మరో విమాన ప్రమాదం తప్పింది. ఈ మధ్య వరుసగా విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. నాలుగు నెలల క్రితం విమాన టేకాఫ్ అవుతుండగా అమాంతంగా టైర్ ఊడిపోయి వాహనాలపై పడడంతో కార్లు ధ్వంసం అయ్యాయి. పైలట్ అప్రమత్తమై చాకచక్యంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా మరో ఘటన కలకలం రేపుతోంది.
ఇది కూడా చదవండి: Usha Uthup: స్టార్ పాన్ ఇండియన్ సింగర్ ఇంట తీవ్ర విషాదం
యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 757-200 విమానం సోమవారం లాస్‌ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ల్యాండింగ్ గేర్ టైర్ ఊడిపోయింది. అనంతరం విమానం డెన్వర్‌లో సురక్షితంగా ల్యాండ్ అవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 174 మంది ప్రయాణికులతో పాటు ఏడుగురు సిబ్బంది ఉన్నారు. విమానం నుంచి టైర్ ఊడిపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఈ ఘటనపై యునైటెడ్ ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ… ఊడిన టైరు లాస్ ఎంజిల్స్‌లో లభించిందని.. ఈ ఘటనపై విచారణ జరుపుతామని తెలిపింది.
ఇది కూడా చదవండి: Budget 2024: అటల్ పింఛన్‌దారులకు శుభవార్త! ఒకేసారి డబుల్ చేసే యోచనలో కేంద్రం
యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో ఈ తరహా ఘటన చోటుచేసుకోవడం నాలుగు నెలల్లో ఇది రెండోసారి కావడం విశేషం. మార్చిలో ఇదే సంస్థకు చెందిన బోయింగ్ విమానం శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి జపాన్ బయల్దేరగా.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే టైర్ ఊడిపోయింది. దీంతో విమానాన్ని లాస్ ఏంజిల్స్‌లో అత్యవసరంగా దించేశారు. ఊడిన టైరు కార్ల పార్కింగ్‌లోని ఒక కారుపై పడి దాని అద్దాలు ధ్వంసమయ్యాయి.
ఇది కూడా చదవండి: KTR: జగన్ ఓటమిపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అది ఆశ్చర్యం కలిగించింది..!