రీల్స్ జబ్బు ఆస్పత్రులకు కూడా పాకింది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక యువత రీల్స్ మోజులో పడి ఎక్కడ పడితే అక్కడ షూట్ చేస్తున్నారు. మెట్రో, ఎయిర్‌పోర్టులు, ఈ మధ్య విమానాల్లో కూడా రీల్స్ చేయడం చూశాం. తాజాగా కొందరు నర్సులు డ్యూటీలో ఉండగా.. విధుల్ని పక్కన పెట్టి పిల్ల కోతితో రీల్స్ చేయడం తీవ్ర కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆరుగురు నర్సులపై అధికారులు సస్పె్న్షన్ వేటు వేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో ప్రభుత్వ మహిళా ఆస్పత్రిలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Darshan: దర్శన్ మెడకు రేణుకాస్వామి హత్యకేసు.. పక్కా ఆధారాలు లభ్యం?
మహారాజా సుహెల్‌దేవ్ వైద్య కళాశాల ఆధ్వర్యంలోని ఆస్పత్రిలో కొందరు నర్సులు విధుల్లో ఉంటూ కోతిపిల్లతో ఆడుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. నర్సులు అంజలి, కిరణ్ సింగ్, ఆంచల్ శుక్లా, ప్రియా రిచర్డ్, పూనమ్ పాండే, సంధ్యా సింగ్‌లు ఆఫ్రానులు ధరించి ఆస్పత్రి కుర్చీలపై కూర్చుని రీల్స్ చేశారు. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో సీరియస్ అయ్యారు.
ఇది కూడా చదవండి: Sanjana: అర్థరాత్రి వీఐపీ కొడుకు అసభ్యకరమైన మెసేజులు.. సంజన సంచలన వ్యాఖ్యలు
ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డా. ఎం.ఎం.త్రిపాఠి స్పందించారు. నర్సులు ఆసుపత్రి గైనకాలజీ, ప్రసూతి విభాగంలో పనిచేస్తున్నట్లుగా గుర్తించినట్లు తెలిపారు. వీడియోలో ఉన్న ఆరుగురు నర్సుల్ని వైద్య కళాశాల ప్రిన్సిపల్ సంజయ్ ఖత్రీ జూలై 5న విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు. ఈ అంశంపై విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు త్రిపాఠి తెలిపారు. డ్యూటీ సమయంలో కోతితో రీల్స్ చేయడం, పనిలో నిర్లక్ష్యంగా వ్యవహరించేలా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోతో వైద్యకళాశాల ప్రతిష్ట దెబ్బతింటుందని ప్రిన్సిపాల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణకు కమిటీని ఏర్పాటు చేశామని .. నివేదిక అందేవరకు ఈ ఆరుగురిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు.
#उत्तर_प्रदेश के #बहराइच सरकारी महिला अस्पताल में ड्यूटी के दौरान नर्सें बंदर से खेल रही थीं। वीडियो वायरल हुई तो सभी को निलंबित कर दिया गया। #viralvidio pic.twitter.com/Hg7VVwuIh3
— KAMLESH BHATT कमलेश भट्ट (@kamleshcbhatt) July 9, 2024