Budget 2024: అటల్ పింఛన్‌దారులకు శుభవార్త! ఒకేసారి డబుల్ చేసే యోచనలో కేంద్రం
- అటల్ పింఛన్‌దారులకు శుభవార్త!
- ఒకేసారి డబుల్ చేసే యోచనలో కేంద్రం
- ప్రకటన చేస్తే నెలకు రూ.10 వేలు పెన్షన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌లో అటల్ పెన్షన్ దారులకు శుభవార్త చెప్పే యోచనలో ఉంది. కేంద్రంలో మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడింది. ఈ నెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఇక జూలై 23న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌లో పలు వర్గాలపై వరాలు కురిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Inaya Sultana: బాయ్ ఫ్రెండ్‌తో ఇనయా.. బాత్ టవల్‌లో ఈ రచ్చ ఏంట్రా?
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ప్రాముఖ్యంగా అటల్ పెన్షన్ యోజన పథకాన్ని మార్పులు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద అందించే పింఛన్ మొత్తాన్ని పెంచే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. గ్యారెంటీ పెన్షన్ మొత్తాన్ని రూ.5 వేలు నుంచి రూ.10 వేలకు పెంచాలని చూస్తోంది. అటల్ పెన్షన్ యోజనను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు గ్యారెంటీగా ఇచ్చే మొత్తాన్ని పెంచేందుకు ఉన్న అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఇది కూడా చదవండి: BMW Hit-And-Run Case: ముంబై హిట్ అండ్ రన్ కేసు.. 72 గంటల తర్వాత నిందితుడి అరెస్ట్..
ఎలాంటి పింఛను పథకాలకు నోచుకోని వారికోసం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని 2015 బడ్జెట్‌లో ప్రకటించారు. నెలకు రూ.1000-5000 వరకు పెన్షన్ అందుతుంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తులు ఈ పథకానికి అర్హులు. అందుకు అనుగుణంగా నెలనెలా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకంలో 6.62 కోట్ల మంది చేరారు. ఒక్క 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే 1.22 కోట్ల మంది ఈ పథకంలో చేరారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ దీన్ని నిర్వహిస్తుంది. జులై 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఆ మేరకు ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: SLBC Meeting: SLBC సమావేశంలో కీలక నిర్ణయం.. రూ.5,40,000 కోట్లతో రుణ ప్రణాళిక..
తాజావార్తలు
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!