పరిశ్రమలు, ప్రైవేటు సంస్థల్లో స్థానికులకే వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాలంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ‘ఎక్స్’లో చేసిన ప్రకటన తీవ్ర కలకలం రేపింది. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బుధవారం దాన్ని తొలగించారు.
త్వరలో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. దీంతో ఇండియా కూటమిలోని మిత్రపక్షాల మధ్య విభేదాలు తలెత్తినట్లుగా కనిపిస్తోంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
దేశ వ్యాప్తంగా కుక్కలు విజృంభిస్తున్నాయి. ఎక్కడో చోట కుక్కల దాడిలో చిన్న పిల్లల దగ్గర నుంచీ.. పెద్దోళ్లు వరకు గాయపడుతునే ఉంటున్నారు. రోడ్ల మీదకు రావాలంటేనే హడలెత్తిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. రహదారుల ప్రక్కన.. కాచు కూర్చుని అమాంతంగా వాహనదారులపై ఎటాక్ చేస్తున్నాయి
కేంద్ర బడ్జెట్ ముందు దేశీయ స్టాక్ మార్కెట్‌కు కొత్త ఊపు వచ్చింది. గురువారం మరోసారి రికార్డు స్థాయిలో సూచీలు దూసుకుపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండు కూడా జీవితకాల గరిష్టాలను నమోదు చేసి సరికొత్త రికార్డులను నమోదు చేశాయి.
మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తు్న్నాయి. ఆయా ప్రాంతాలు చిత్తడి చిత్తడిగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో రీల్స్ చేయడానికి ప్రయత్నించిన ఒక ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రాయ్‌గఢ్ సమీపంలోని కుంభే జలపాతం చోటుచేసుకుంది.
ఇటీవల కాలంలో నిరుద్యోగుల ఉద్యోగాల కోసం పోటెత్తున్నారు. నోటిఫికేషన్లు వెలువడగానే జాబ్స్ కోసం ఎగబడుతున్నారు. ఆ మధ్య గుజరాత్లో హోటల్ ఉద్యోగం కోసం యువత ఎగబడింది.
ఆమె ఒక ప్రైవేటు బ్యాంక్‌లో ఉద్యోగి. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంది. అదే సహోద్యోగులకు రుచించలేదు. నిత్యం ఆమెకు నరకం చూపించారు. క్షణం.. క్షణం కుమిలిపోయింది. అనేక రకాలుగా వేధింపులకు పాల్పడ్డారు.
మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇక మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. నిరుద్యోగ యువత కోసం ఓ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది.
క్రికెటర్ కేఎల్.రాహుల్, సతీమణి అతియా శెట్టి ముంబైలో నూతన గృహాన్ని కొనుగోలు చేశారు. బాంద్రాలోని పాలిహిల్ ప్రాంతంలోని రూ.20 కోట్లతో ఇల్లు కొనుగోలు చేశారు.