Supreme court: సుప్రీంకు ఇద్దరు కొత్త జడ్జీలు.. తొలిసారి మణిపూర్ నుంచి నియామకం
- సుప్రీంకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జీలు
- తొలిసారి మణిపూర్ నుంచి నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ సర్వోన్నత న్యాయస్థానానికి కొత్తగా ఇద్దరు జడ్జీల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ నియామకాలను న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్ మహదేవన్‌ను కేంద్రం నియమించింది. దీంతో ఇప్పుడు సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్య భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌తో సహా 34 మంది అయ్యారు. ఈ ఇద్దరు న్యాయమూర్తులు పదోన్నతిని సుప్రీంకోర్టు కొలీజియం గతంలో సిఫారసు చేసింది.
ఇది కూడా చదవండి: SIIMA 2024: సైమా 2024.. దసరా vs హాయ్ నాన్న.. నానితో నానికే పోటీ!
Also Read
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ మణిపూర్ నుంచి సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన మొదటి న్యాయమూర్తిగా నిలిచారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. జస్టిస్ కోటీశ్వర్ సింగ్ మణిపూర్ మొదటి అడ్వకేట్ జనరల్ ఎన్ ఇబోటోంబి సింగ్ కుమారుడు. ఢిల్లీ యూనివర్శిటీలోని కిరోరి మాల్ కాలేజ్ మరియు క్యాంపస్ లా సెంటర్‌లో పూర్వ విద్యార్థి. 1986లో న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించారు. న్యాయమూర్తి కాకముందు మణిపూర్ అడ్వకేట్ జనరల్‌గా కూడా పనిచేశారు. అనంతరం గౌహతి హైకోర్టు మరియు మణిపూర్ హైకోర్టులలో పనిచేశారు.
ఇది కూడా చదవండి: Crime News: యువతిని కిడ్నాప్ చేసి వేళ్లు, గొంతు కోసి హత్య..
ఇక జస్టిస్ మహదేవన్ ప్రస్తుతం మద్రాసు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. చెన్నైలో జన్మించిన జస్టిస్ మహదేవన్ మద్రాసు న్యాయ కళాశాల పూర్వ విద్యార్థి. న్యాయవాదిగా 9,000 కేసులకు పైగా డీల్ చేశారు. తమిళనాడు ప్రభుత్వానికి అదనపు గవర్నమెంట్ ప్లీడర్ (పన్నులు), అదనపు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సెల్ మరియు మద్రాసు హైకోర్టులో భారత ప్రభుత్వానికి సీనియర్ ప్యానెల్ న్యాయవాదిగా కూడా పనిచేశారు. 2013లో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
In exercise of the powers conferred by the Constitution of India, Hon’ble President, after consultation with Hon’ble Chief Justice of India, is pleased to appoint the following as
Supreme Court Judges:- pic.twitter.com/OWQ9iGIooG— Arjun Ram Meghwal (@arjunrammeghwal) July 16, 2024
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!