దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి వరుస లాభాల్లో దూసుకెళ్లాయి. సోమవారం జీవితకాల గరిష్టాలను నమోదు చేయగా.. మంగళవారం కూడా భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 80,756 మార్కు దాటగా.. నిఫ్టీ కూడా 24, 630 మార్కు దాటింది. దీంతో మార్కెట్‌కు లాభాల పరంపర కొనసాగుతోంది. ఇక ముగింపులో సెన్సెక్స్ 51 స్వల్ప పాయింట్లతో లాభపడి 80, 716 దగ్గర ముగియగా.. నిఫ్టీ 26 పాయింట్లు లాభపడి 24, 613 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.58 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ ఓటీటీ రిలీజ్ పై కీలక ప్రకటన
నిఫ్టీలో కోల్ ఇండియా, బీపీసీఎల్, హెచ్‌యూఎల్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, భారతీ ఎయిర్‌టెల్ లాభపడగా, శ్రీరామ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టపోయాయి.
ఇది కూడా చదవండి: IAS Puja khedkar: అర్ధరాత్రి పూజా ఇంటికి పోలీసులు.. సస్పెన్ష్‌గా దర్యాప్తు!