కొందరికి పైత్యం బాగా ముదిరి ఏం చేస్తున్నారో వారికే అర్థం కాదు. తాజాగా హైవేపై ఓ యువకుడు చేసిన డేంజరస్ స్టంట్ భయాందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు దుమ్మె్త్తిపోస్తున్నారు.
అది నేషనల్ హైవే. వాహనాలు జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నాయి. అలాంటి బిజీ రోడ్డుపై ఓ యువకుడు డేంజరస్ స్టంట్స్ చేసి తోటివారిని భయాందోళనకు గురిచేశాడు. పెట్రోల్ ట్యాంక్‌పై పసిబిడ్డ ఉన్నాడు. ఉన్నట్టుండి ఏమైందో ఏమో తెలియదు గానీ.. ఒక్కసారిగా యువకుడు బైక్‌ను స్పీడ్‌గా పోనిస్తూ.. చేతులు వదిలేసి.. కిందకి పైకి లేస్తూ గంతులేశాడు. అంతేకాకుండా ఒక ఎద్దు ఎదురొచ్చినా స్పీడ్ తగ్గించలేదు. ఏ మాత్రం భయపడకుండా పోనిచ్చాడు. వెనుక వస్తున్న వాహనదారులు ఈ దృశ్యాలను మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. వీక్షించిన నెటిజన్లు డేంజరస్ విన్యాసాలు చేసిన వ్యక్తిపై మండిపడుతున్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తి.. సీతాపూర్ పోలీసులకు ట్యాగ్ చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ వీడియోను చేసిన పోలీసులు… విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌ని ఆదేశించారు. అయితే ఈ ఘనటకు సంబంధించి ఎటువంటి పోలీసు చర్యలు తీసుకున్నట్లు కనిపించలేదు. ఇదిలా ఉంటే వాహనం మాత్రం సీతాపూర్‌కు చెందినదిగా తెలుస్తోంది.
एक मासूम बच्चे को बाइक पर बैठाकर खतरनाक स्टंट करने वाले इस मनबढ़ शख्स को त्वरित गति से सबक सिखाएं कृपया @dgpup @Uppolice @UPPViralCheck
वायरल वीडियो में नजर आ रही बाइक का नंबर सीतापुर का नजर आ रहा है! pic.twitter.com/bKVqHYVzMJ— Gyanendra Shukla (@gyanu999) July 17, 2024