Suvendu: మైనారిటీ మోర్చాపై సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు
- మైనారిటీ మోర్చాపై సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు
- మైనారిటీ మోర్చా అవసరం లేదని వ్యాఖ్య
- తన వ్యాఖ్యలు ఎవర్ని ఉద్దేశించినవి కావని సవరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైనారిటీ మోర్చాపై పశ్చిమబెంగాల్ బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మైనారిటీ కమ్యూనిటీ నుంచి మద్దతు లభించలేదని.. అందుకే బీజేపీ సీట్లు గెలవలేకపోయిందన్నారు. దీంతో ఆయన ‘సబ్కా సాత్, సబ్‌కా వికాస్’ అనవసరమన్నారు. దీనికి బదులుగా ‘హమ్ ఉంకే సాథ్ జో హుమారే సాథ్’ను ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. మైనార్టీలు బీజేపీతో లేనప్పుడు మైనారిటీ మోర్చా అవసరం లేదని పేర్కొ్న్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యకర్త సమావేశంలో సువేందు ఈ వ్యాఖ్యలు చేశారు.
లోక్‌సభ ఎన్నికల సమయంలో చాలా ప్రాంతాల్లో టీఎంసికి చెందిన జిహాదీ గూండాలు హిందువులు ఓటు వేయడానికి అనుమతించలేదని సువేంద్ వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌లో స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగడం సాధ్యం కాదన్నారు. టీఎంసీకి చెందిన జిహాదీ గూండాలు అనుమతించరని తెలిపారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తేనే స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతాయన్నారు. అప్పుడే బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
పశ్చిమ బెంగాల్‌లో మైనారిటీ ఓటర్లు 30 శాతం మంది ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ పశ్చిమ బెంగాల్‌లో మైనారిటీ ఓట్లు టీఎంసీకి పడ్డాయి. ఉత్తరాన మాత్రం వామపక్షాలు-కాంగ్రెస్ ఓట్ల విభజనతో మాత్రం బీజేపీకి లాభించింది.
ఇక గత వారం జరిగిన ఉపఎన్నికల్లో టీఎంసి మూడు అసెంబ్లీ స్థానాలను నిలబెట్టుకుంది. దీంతో బీజేపీ నైరాశంలో పడింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 18 స్థానాలు గెలిస్తే.. 2024లో 12 స్థానాలే సొంతం చేసుకుంది. ఇక సువేందు వ్యాఖ్యాలు వివాదాస్పదం కావడంతో తన వ్యాఖ్యలు ఏ వర్గాన్ని ఉద్దేశించినవి కావని తెలిపారు.
My statement is being taken out of context. I am clear that those who are Nationalists, stand for this Nation and Bengal, we should be with them. Those who don’t stand with us, work against the interest of Nation and Bengal, we need to expose them. Also, like Mamata Banerjee, we…
— Suvendu Adhikari (@SuvenduWB) July 17, 2024
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!