Video: కలెక్టరేట్‌లో వృద్ధ అన్నదాత పొర్లు దండాలు.. కళ్లప్పగించి చూసిన అధికారులు..!
- కలెక్టరేట్‌లో వృద్ధ అన్నదాత పొర్లు దండాలు
- కళ్లప్పగించి చూసిన అధికారులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నదాతా సుఖీభవ.. అన్నదాత విజయీభవ అంటారు పెద్దలు. కర్షకుడు.. ఆరుగాలం కష్టపడి.. పండిస్తే.. ప్రజలకు కడుపునిండా అన్నం దొరుకుతుంది. అందుకే రైతేరాజు అన్నారు. అలాంటి అన్నదాతకు కష్టం వస్తే.. కనికరించే నాథుడే లేకుండా పోయాడు. తనకు న్యాయం చేయండి అంటూ కలెక్టరేట్‌కు వచ్చి పొర్లు దండాలు పెట్టినా.. పట్టించుకున్నా పాపాన పోలేదు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
తన భూమిని ల్యాండ్ మాఫియా కాజేశారని… వారి నుంచి కాపాడి తనకు ఇప్పించాలని ఓ వృద్ధ రైతు ప్రభుత్వ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. అయినప్పటికీ వారిలో చలనం లేకపోవడంతో వినూత్నంగా నిరసన తెలిపాడు. చేతులు జోడించి కలెక్టరేట్ ఆఫీస్ నేలపై దొర్లుతూ పొర్లు దండాలు పెట్టాడు. ఆ సమయంలోనూ అధికారులు.. అలా చేశారే తప్ప.. ఆపే ప్రయత్నమూ చేయలేదు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Also Read
వీడియోలో పొర్లు దండాలు పెడుతున్న రైతు పేరు.. శంకర్‌లాల్(65). ఆయనకు వారసత్వంగా వచ్చిన భూమిని ల్యాండ్ మాఫియా ఆక్రమించుకుందంట. వారి నుంచి దానిని తిరిగి తనకు ఇప్పించాలని ఎన్నో ఏళ్లుగా ఆయన ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అధికారుల్లో చలనం రాకపోవడంతో పొర్లు దండాలతో ‘న్యాయం చేయండి ప్రభో’ అంటూ వేడుకున్నాడు. మందసౌర్‌లోని కలెక్టరేట్ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతు శంకర్‌లాల్ ఆరోపించారు. తన భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సహకరించాలని రాష్ట్రపతి, ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినా ఎలాంటి స్పందన రాలేదని రైతు శంకర్‌లాల్ వాపోయాడు. ఇదిలా ఉంటే వివాదాస్పద భూమి శంకర్‌లాల్ ఆధీనంలోనే ఉందని స్థానిక యంత్రాంగం అంటుంది.
यह किसान मंदसौर का हैं, इसका आरोप है कि इसका ज़मीन फर्जी दस्तावेजों के जरिये कुछ लोगों ने हड़प ली है … लेकिन लाख कोशिश करने के बाद भी पुलिस ने इसकी मदद नहीं की जिसके बाद यह कलेक्टर दफ्तर से यूं निराश होकर लौटेने लगा pic.twitter.com/63VgHqpHfz
— Priya singh (@priyarajputlive) July 17, 2024
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!+
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!