వయనాడ్ బాధితుల కోసం చీటింగ్ కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ భారీ సాయం ప్రకటించాడు. ముఖ్యమంత్రి సహాయ నిధికి తన విరాళంగా రూ. 15 కోట్లను అంగీకరించాల్సిందిగా కేరళ సీఎం పినరయి విజయన్‌కు చంద్రశేఖర్ లేఖ రాశారు. అంతేకాకుండా బాధితులకు తక్షణ ప్రాతిపదికన 300 ఇళ్ళు నిర్మించడానికి మరింత సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు సుకేష్ తన లేఖలో పేర్కొన్నాడు.
బంగ్లాదేశ్‌లో అల్లర్ల తర్వాత బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఉంటున్నారు. ఇదే అంశంపై యూకే విదేశాంగ శాఖ కార్యదర్శి డేవిడ్ లామీతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ ఫోన్లో సంభాషించారు.
షేక్ హసీనా ప్రధానిగా 15 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో ఓ తాగుబోతు రైల్వే అధికారులకు షాకిచ్చాడు. మద్యం మత్తులో రైల్వేట్రాక్‌పైనే నిద్రపోయాడు. ఆ సమయంలో ట్రైన్ కూడా వచ్చేసింది. కానీ ఆ వ్యక్తి ఎలాంటి గాయాలు కాకుండానే క్షేమంగా బయటపడ్డాడు.
కేరళలోని వయనాడ్‌లో జరిగిన విపత్తు తర్వాత ఇండియన్ ఆర్మీ చేసిన సాహసాలను ఎవ్వరూ మరిచిపోవడం లేదు. ప్రాణాలను తెగించి సహాయ చర్యలు పాల్గొన్నారు. అర్ధరాత్రి కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
ధైర్యవంతులైన విద్యార్థులు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారంటూ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా వీడియో సందేశం విడుదల చేశారు. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్‌కు రాగానే.. జియాను అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ విడుదల చేశారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ మార్ఫింగ్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నరేంద్ర మిశ్రా రూ.40 కోట్లకు పరువు నష్టం దావా వేశాడు.
పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్ మ్యాచ్‌కు ముందు వేటుకు గురైన భారత్ స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్‌ను రాజ్యసభకు పంపాలని డిమాండ్ పెరిగింది. ఆమె వేటుకు గురైనప్పుడు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి మద్దతు లభించింది.
2022 నిరసనకు సంబంధించిన కేసులో బెంగళూరు కోర్టు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌కు సమన్లు జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా ఆగస్టు 29న వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని ఇద్దరి నేతలకు బెంగళూరు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.
బెంగళూరులో ఓ కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించే సాహసం చేశాడు. ప్రమాదమని తెలిసినా కూడా ఏ మాత్రం భయపడకుండా డేరింగ్ అరెస్ట్ చేసి శెభాష్ అనిపించుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.