Bengaluru video: ఈ కానిస్టేబుల్‌కు సెల్యూట్ కొట్టాల్సిందే.. ప్రాణాలకు తెగించి డేరింగ్ అరెస్ట్
- బెంగళూరులో ఓ కానిస్టేబుల్ డేరింగ్ అరెస్ట్
- ప్రాణాలు తెగించి నిందితుడ్ని అరెస్ట్ చేసిన లింగయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులో ఓ కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించే సాహసం చేశాడు. ప్రమాదమని తెలిసినా కూడా ఏ మాత్రం భయపడకుండా డేరింగ్ అరెస్ట్ చేసి శెభాష్ అనిపించుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
బెంగళూరులో రద్దీగా ఉండే ప్రాంతం. అదే చోట సివిల్ డ్రస్‌లో కానిస్టేబుల్ లింగయ్య ఉన్నాడు. ట్రాఫిక్‌లో సడన్‌గా ఓ నేరస్తుడు మంజేష్ కనిపించాడు. అతడు ముఖానికి కర్చీప్ కట్టుకుని.. తలకు హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు. అతడు నిందితుడు మంజేష్ అని కానిస్టేబుల్ లింగయ్య పసిగట్టాడు. మంజేష్‌పై దాదాపు 75కు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎప్పటి నుంచో పోలీసుల నిఘాలో ఉన్నాడు. పోలీసుల కళ్లుగప్పి.. తప్పించుకుని తిరుగుతున్నాడు. మంజేష్ స్కూటీపై ట్రాఫిక్‌లో కనిపించగానే.. కానిస్టేబుల్ లింగయ్య.. అతడి ముందు దూకాడు. అంతే ఒక్కసారిగా ద్విచక్ర వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. అయినా కూడా లింగయ్య ఏ మాత్రం వదిలిపెట్టకుండా.. ఉడుంపట్టు పట్టాడు. నిందితుడు ఈడ్చుకుని పోతున్నా.. వదిలిపెట్టలేదు. ఇలా దాదాపు 20 మీటర్లు ఈడ్చుకెళ్లిపోయాడు. ఇంతలో అక్కడే ఉన్న మరో ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా కూడా నిందితుడు పోలీసుల్ని తోసేసి పారిపోయే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న మరికొంత మంది బైకర్స్ సాయంతో నిందితుడ్ని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Naga Chaitanya- Sobhita Dhulipala: ఇదంతా ముందే తెలుసా?
ప్రస్తుతం కానిస్టేబుల్ ధైర్యసాహసాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కానిస్టేబుల్ లింగయ్య ప్రాణాలు తెగించి నిందితుడ్ని పట్టుకోవడంపై ప్రశంసలు అందుతున్నాయి. శెభాష్ అంటూ నెటిజన్లు కీర్తిస్తున్నారు. కానిస్టేబుల్ లింగయ్యను పోలీసులు అధికారులు కూడా అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి.
#Watch | Constable Risks Life, Jumps in Front of Motorbike to Catch Fleeing Criminal in Bengaluru#MyNewsNE #BengaluruPolice #DaringArrest #CCTVCatch #PoliceBravery #KoratagerePolice #TumkurDistrict #CrimeNews #IndiaNews #PoliceInAction #HeroCop pic.twitter.com/fI585NoPAv
— My News NE (@MyNewsNE) August 8, 2024
తాజావార్తలు
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!