ఢిల్లీలోని తీహార్ జైల్లో అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న దీపక్ శర్మ ప్రవర్తన శృతిమించింది. ఓ బర్త్ డే పార్టీలో తుపాకీ పట్టుకుని హల్చల్ చేశాడు. సంజయ్ దత్ సినిమాలోని ‘ఖల్ నాయక్ హూన్ మైన్’ పాటకు డ్యాన్స్ చేస్తూ ఊగిపోయాడు.
తీహార్ జైలు నుంచి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా విడుదలయ్యారు. లిక్కర్ పాలసీ కేసులో సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు.
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత పరిణామాలు భయాందోళనగా మారాయి. హిందువుల్ని లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు జరిగాయి. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చేశారు.
ఆదివారం జరగనున్న నీట్ పరీక్షను వాయిదా వేయాలని కొంత మంది విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. శుక్రవారం విచారించిన న్యాయస్థానం.. పిటిషన్లను తిరస్కరించింది.
ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ యోహాన్ పూనావాలా, భార్య మిచెల్లో ముంబైలో ఖరీదైన భవంతిని కొనుగోలు చేశారు. దక్షిణ ముంబైలోని కఫ్ పరేడ్ ప్రాంతంలో రూ.500 కోట్లకు 30,000 చదరపు అడుగుల విస్తీరణంలో స్వతంత్ర ఆస్తిని కొనుగోలు చేశారు. ఇటీవల కాలంలో అత్యంత ఖరీదైన నివాసం ఇదే కావడం విశేషం. దీనికి ‘పూనావాలా మాన్షన్’ అని నామకరణం చేశారు.
పార్లమెంట్ ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డాయి. జూలై 22న వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. మోడీ 3.0 ప్రభుత్వం జూలై 23న 2024-25 సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్‌పై సుదీర్ఘ చర్చ అనంతరం శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి.
మహారాష్ట్రలో పూణె హిట్ అండ్ రన్ ఘటనను మరువక ముందే పాల్ఘర్లో శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. స్కార్పియో వాహనం అతి వేగంగా దూసుకురావడంతో సాగర్ గజానన్ పాటిల్ అనే 29 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
గురువారం ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానాలు ప్రకటించింది. ఆ సమయంలో స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్పంగా లాభాల్లోకి వెళ్లినట్లే వెళ్లి నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. శుక్రవారం మాత్రం అందుకు భిన్నంగా కొనుగోళ్లు కనిపించాయి.
వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఫ్యామిలీని కేసులు కష్టాలు వెంటాడుతున్నాయి. పూజా ఇప్పటికే ఉద్యోగాన్ని కోల్పోవడమే కాకుండా క్రిమినల్ కేసులో పీకల్లోతు కష్టాల్లో ఉంది. వివాదాలు వెంటాడుతున్న సమయలోనే పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఓ అన్నదాతను తుపాకీతో బెదిరించిన కేసులో జైలుకెళ్లింది.
దేశ వ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ జార్ఖండ్.. దక్షిణ హర్యానా మీదుగా తుఫాను ఏర్పడనుందని.. దీని ప్రభావం సమీప ప్రాంతాలపై ఉంటుందని ఐఎండీ వెల్లడించింది.