రోజురోజుకి సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఓ వైపు క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలకు కళ్లెం వేస్తున్నా.. ఇంకోవైపు సైబర్ నేరగాళ్లు కూడా సరికొత్త వ్యూహాలతో ఖాకీలకే సవాళ్లు విసురుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఒక ఐఏఎస్ పేరుతో బంధువుల్ని బురిడీ కొట్టించి నగదు కాజేశారు. ఈ ఘటన జబల్పూర్లో జరిగింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ మరోసారి ట్రయల్ కోర్టు పొడిగించింది. ఆగస్టు 20 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. గురువారం కేజ్రీవాల్‌ను తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు హాజరుపరచగా.. కోర్టు రిమాండ్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
గురువారం ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు ప్రకటించింది. రెపో రేటు వరుసగా తొమ్మిదోసారి యథాతథంగా ఉంచింది. అయినా కూడా దేశీయ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి.
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే కేంద్ర పాలిత ప్రాంతంలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సెనాకు లేఖ రాశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15 వేడుకల్లో జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మంత్రి అతిషికి అనుమతి ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
పారిస్‌లో జరిగిన ఒలంపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన మహిళా షూటర్ మను భాకర్ బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఉదయం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెకు భారీ ఘనస్వాగతం లభించింది.
వయనాడ్‌లో ప్రకృతి విలయతాండవం చేసింది. కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 450 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది గల్లంతయ్యారు. ఇంకొందరు క్షతగాత్రులయ్యారు. అయితే ఈ విపత్తుని జాతీయ విపత్తుగా ప్రకటించాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని కోరారు.
ముంబై ఆస్పత్రిలో ఓ కార్మికుడు నీచానికి పాల్పడ్డాడు. మహిళా డాక్టర్ స్నానం చేస్తుండగా కిటికీలోంచి మొబైల్ ద్వారా రికార్డ్ చేశాడు. గమనించిన బాధితురాలు కేకలు వేయడంతో బండారం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జయేష్ సోలంకిని పోలీసులు అరెస్ట్ చేశారు.
శ్రీలంక అధ్యక్ష బరిలోకి మహీందా రాజపక్సా కుటుంబం నుంచి వారసుడు బరిలోకి వచ్చాడు. సెప్టెంబర్ 21న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో కుమారుడు నమల్ రాజపక్సా పోటీ చేయబోతున్నట్లు కుటుంబం ప్రకటించింది. ఎస్ఎల్పీపీ పార్టీ తరఫున దేశ అధ్యక్ష అభ్యర్థిగా నమల్ రాజపక్సా (38) పేరును ప్రతిపాదించారు.
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్, ప్రియురాలు పవిత్రగౌడ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఈ కేసులో పోలీసులకు కీలక రిపోర్టు చిక్కింది.