షేక్ హసీనా ప్రధానిగా 15 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్ష కార్యాలయం ‘బంగభబన్’లో నిర్వహించిన కార్యక్రమంలో యూనస్‌తో దేశాధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్ ప్రమాణం చేయించారు. కోటా ఉద్యమం తర్వాత ప్రధానిగా ఉన్న షేక్ హసీనా రాజీనామా చేసి భారత్‌కు వచ్చేశారు. ఈ క్రమంలోనే దేశాధ్యక్షుడు పార్లమెంటును రద్దు చేశారు. తాత్కాలిక పరిపాలన యంత్రాంగానికి యూనస్‌ను సారథిగా నియమిస్తున్నట్లు సైన్యం ప్రకటించింది. గురువారం ఉదయం ఫ్రాన్స్ నుంచి ఢాకాకు చేరుకున్న యూనస్.. సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు.
‘‘నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తాను. మద్దతు ఇస్తాను మరియు రక్షిస్తాను. నా విధులను నిజాయితీగా నిర్వహిస్తాను’’ అని ప్రమాణ స్వీకార కార్యక్రమంలో యూనస్ అన్నారు.
యూనస్(84) మైక్రోక్రెడిట్ మరియు మైక్రోఫైనాన్స్‌కు మార్గదర్శకత్వం వహించినందుకు 2006లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. గ్రామీణ బ్యాంక్ ద్వారా అమలులోకి తెచ్చాడు. పారిస్ నుంచి ఢాకాకు తిరిగి వచ్చిన కొన్ని గంటల తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి షహబుద్దీన్ తన అధికారిక నివాసం బంగాబబన్‌లో ప్రమాణం చేయించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. యూనస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. బంగ్లాదేశ్‌లో త్వరగా సాధారణ స్థితికి రావాలని భారతదేశం ఆశిస్తోందన్నారు. హిందువులు మరియు ఇతర మైనారిటీల భద్రతను కూడా కాపాడాలని కోరారు.