ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోసం ఇండియా కూటమి రంగంలోకి దిగబోతుంది. లిక్కర్ కేసులో మార్చి 21న అరెస్టై.. తీహార్ జైల్లో ఉంటున్నారు. దాదాపు నాలుగు నెలల నుంచి జైల్లో ఉండడంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది
లండన్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ప్రయాణికుల పట్ల భద్రతా సిబ్బంది అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. ప్రయాణికుల కళ్లల్లో పెప్పర్ స్ప్రే చల్లి నేలకేసి కొట్టారు. ఇష్టానుసారంగా హింసించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
త్వరలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగానే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఆయనపై ఇటీవల హత్యాయత్నం జరిగింది.
చాలా మంది జీవితం బాగుపడాలంటే అదృష్టం కలిసి రావాలంటారు. ఇది సరదాగా అంటారో లేదంటే నిజంగానే అంటారో తెలియదు గానీ.. ఓ కార్మికుడి పట్ల ఇది అక్షరాల నిజమైంది. మధ్యప్రదేశ్‌కు చెందిన కార్మికుడికి రూ.80 లక్షల విలువైన వజ్రం దొరికింది. దీంతో అతడి కుటుంబ సభ్యులంతా సంతోషంతో ఎగిరి గంతులు వేస్తున్నారు.
తీవ్రరక్తస్రావమై ప్రమాదంలో ఉన్న చైనీయుడిని సాహసోపేతమైన ఆపరేషన్ చేసి ఇండియన్ నేవీ రక్షించింది. ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పారిస్ ఒలింపిక్స్‌ను అస్థిరపరిచేందుకు కుట్ర పన్నిన 40 ఏళ్ల రష్యా వ్యక్తిని ఫ్రెంచ్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తిని ముందస్తు నిర్బంధంలో ఉంచారు. నేరం రుజువైతే 30 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడవచ్చు.
నాలుగేళ్ల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో మూడు సార్లు బంగారు పతకాన్ని సాధించిన బ్రిటీష్ ఒలింపియన్ షార్లెట్ డుజార్డిన్ 2024 పారిస్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది.
పేపర్ లీకేజీ వ్యవహారాలు దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి. ఏదొక రాష్ట్రంలో అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కేంద్రం నిర్వహించిన నీట్ ఎగ్జామ్ పేపర్ కూడా లీకేజీ కావడం పెను సంచలనంగా మారింది.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను నటుడు దర్శన్ సతీమణి విజయలక్ష్మీ కలిశారు. ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది. అభిమాని హత్య కేసులో ప్రస్తుతం హీరో దర్శన్ జైల్లో ఉన్నారు. ఇలాంటి తరుణంలో వీరిద్దరి భేటీ జరగడం సర్వత్రా ఆసక్తిగా మారింది.