కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం కేసు వ్యవహారం దేశాన్ని కుదిపిస్తోంది. సభ్య సమాజం తలదించుకునేలా అత్యంత దారుణంగా ఆమె హత్యాచారానికి గురైంది. ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో వెలడైన విషయాలతో గుండెలు తరుక్కుపోతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్‌పై అమెరికా షార్ట్‌సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక తీవ్ర ప్రభావం పడింది. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్ మాత్రం నష్టాలతో ప్రారంభమై.. ఫ్లాట్‌గా ముగిశాయి.
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ చాలా ప్రమాదకరమైన వ్యక్తిగా అభివర్ణించారు. ప్రధాని కాలేదన్న నిరాశలో దేశ ఆర్థిక పరిస్థితిని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.
హర్యానాలోని గురుగ్రామ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ కార్ల వర్క్‌షాప్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో 16 లగ్జరీ కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.7 కోట్లు విలువైన కార్లు బూడిదయ్యాయని సమాచారం.
కోవిడ్-19 కేసులు మళ్లీ కలవరపెడుతున్నాయి. ఆ పేరు వింటేనే చాలా మంది గుండెల్లో దడపడుతుంది. అది సృష్టించిన మారణహోమానికి ఎన్ని కుటుంబాలు బలైపోయాయి. ఎందరో పిల్లలు అనాథలయ్యారు. ఇంకొందరు దిక్కులేని వారయ్యారు.
సునామీ హెచ్చరికలతో జపనీయులు బెంబేలెత్తిపోతున్నారు. రెండ్రోజుల క్రితం 7.1తో భూకంపం సంభవించింది. దీంతో ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు
దేశ రాజధాని ఢిల్లీలో ఓ పాత బిల్డింగ్ కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ఒకరి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారేమోనన్న ఉద్దేశంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి టీవీ సోమనాథన్ నియమితులయ్యారు. 30.08.2024 నుంచి రెండు సంవత్సరాల పదవీకాలంతో కేబినెట్ సెక్రటరీగా సోమనాథన్ కొనసాగనున్నారు. సోమనాథన్ నియామకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది.
కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి 14 రోజులు పోలీసు కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. బీఎన్ఎస్ సెక్షన్లు 64 (అత్యాచారం), 103 (హత్య) కింద అభియోగాలు నమోదయ్యాయి.