దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. గోవింద్‌పురిలో ఐదేళ్ల బాలుడిపై పొరుగింటి వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఈ విషయాన్ని బాలుడు.. తన తల్లిదండ్రులకు తెలియజేశాడు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్లో జోరుకు బ్రేకులు పడ్డాయి. గత వారం రికార్డుల మోత మోగించిన సూచీలు.. ఈ వారం మాత్రం ఆ ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు మన మార్కెట్‌పై ప్రభావం చూపించడంతో బుధవారం ఉదయం నష్టాల్లోనే సూచీలు ప్రారంభమయ్యాయి.
భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలు.. కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని కలిశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ వీరి సమావేశం సర్వత్రా ఆసక్తిగా మారింది. పారిస్ ఒలింపిక్స్‌లో ఉన్నప్పుడే వినేష్ ఫోగట్ కాంగ్రెస్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఇటీవల పంజాబ్-హర్యానా సరిహద్దులో అన్నదాతలు చేస్తున్న ఆందోళనకు వినేష్ ఫోగట్ మద్దతు తెలిపింది.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ సింగపూర్ చేరుకున్నారు. బుధవారం బ్రూనై పర్యటన ముగించుకుని రెండు రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ వెళ్లారు. సింగపూర్‌లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోడీ డోలు వాయించి ఉత్సాహ పరిచారు. అలాగే ఎన్నారైలతో కలిసి ముచ్చటించారు. ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు.
హర్యానాలో కాంగ్రెస్-ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య సీట్ల పంపకం పంచాయితీ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం ఇరు పార్టీల నేతలు సుదీర్ఘ మంతనాల తర్వాత సీట్ల పంపకాలు జరిగినట్లుగా సమాచారం అందుతోంది. ఆప్ 10 సీట్లు అడగ్గా.. ఐదు నుంచి ఏడు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆడి ఇటలీ బాస్ ఫాబ్రిజియో లాంగో 10,000 అడుగుల పర్వతం నుంచి పడి మరణించాడు. ఇటాలియన్-స్విస్ సరిహద్దుకు సమీపంలోని ఆడమెల్లోని పర్వతాన్ని అధిరోహిస్తున్న సమయంలో 10,000 అడుగుల ఎత్తు నుంచి కిందపడి మరణించారు. ఫాబ్రిజియో లాంగో.. పర్వతానికి చేరువవుతున్న సమయంలో అనుకోని ప్రమాదం జరిగి లోయలోకి పడినట్లు సమాచారం.
ప్రధాని మోడీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. బ్రూనై, సింగపూర్ టూర్‌కు వెళ్లారు. అక్కడ నుంచి రాగానే జమ్మూకాశ్మీర్‌లో ప్రధాని ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 8 నుంచి ఎన్నికల ప్రచారంలో మోడీ పాల్గొననున్నారు. మూడు ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని పాల్గొంటారని, జమ్మూ ప్రాంతంలో రెండు చోట్ల, కశ్మీర్లో ఒక చోట బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రధాని ప్రచారం సాగిస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
కేరళలోని తిరువనంతపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పప్పనంకోడ్‌లోని ఇన్సూరెన్స్ కార్యాలయంలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు సజీవదహనం అయ్యారు. ఇద్దరు మహిళలు చనిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఓ వైపు కోల్‌కతా హత్యాచార ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఇంకోవైపు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో కదులుతున్న కారులో మోడల్‌పై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. సోషల్ మీడియాలో కనెక్ట్ అయిన వ్యక్తి.. సినిమా దర్శకుడిని పరిచయం చేస్తానని నమ్మించి ఆగస్టు 28న లక్నోకు పిలిచి అత్యాచారానికి తెగబడ్డాడు. ఇలా కారు, హోటల్లో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి […]