ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఓ వైపు కోల్‌కతా హత్యాచార ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఇంకోవైపు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో కదులుతున్న కారులో మోడల్‌పై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. సోషల్ మీడియాలో కనెక్ట్ అయిన వ్యక్తి.. సినిమా దర్శకుడిని పరిచయం చేస్తానని నమ్మించి ఆగస్టు 28న లక్నోకు పిలిచి అత్యాచారానికి తెగబడ్డాడు. ఇలా కారు, హోటల్‌లో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఇది కూడా చదవండి: TRAI: 2.75 లక్షల టెలిఫోన్ నంబర్లు డిస్‌కనెక్ట్!.. ఎందుకో తెలుసా?
యూపీలోని కాన్పూర్‌కు చెందిన 23 ఏళ్ల మోడల్.. ఫేస్‌బుక్‌లో విపన్ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. సినిమా దర్శకుడిని పరిచయం చేయిపిస్తానని నమ్మించి లక్నోకు పిలిచాడు. చిన్‌హట్ ప్రాంతంలో హోటల్ బుక్ చేశాడు. అందులో విపన్ సింగ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి మోడల్‌పై గ్యాంగ్‌రేప్ చేశారు. అనంతరం డ్రగ్స్ ఎక్కించి.. కారులో కూడా అదే రీతిగా అత్యాచారానికి పాల్పడ్డారు.
ఇది కూడా చదవండి: CS Shanti Kumari: ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను ఈ వారాంతంలోగా సమర్పించాలి..
విపన్ సింగ్, అతడి స్నేహితులైన హిమాన్సు సింగ్, వినయ్ సింగ్‌లు మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిద్రలోంచి లేచిన తర్వాత తనపై అఘాయిత్యం జరిగినట్లుగా గుర్తించినట్లు ఆమె తెలిపింది. ఎవరికైనా చెబితే చంపేస్తామని నిందితులు బెదిరించడంతో కాన్పూర్‌కు చేరుకుని విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో కుటుంబ సభ్యుల సహాయంతో బాధితురాలు చిన్‌హట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… ఇద్దరు నిందితులు విపిన్ సింగ్, హిమాన్షు సింగ్‌లను అదుపులోకి తీసుకున్నారు. మూడో నిందితుడు వినయ్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.