Delhi: రాహుల్‌గాంధీతో వినేష్ ఫోగట్ భేటీ.. కాంగ్రెస్ టికెట్ ఖాయమా?
- రాహుల్‌గాంధీతో వినేష్ ఫోగట్ భేటీ
- కాంగ్రెస్ టికెట్ ఖాయమా?
- ఈ సాయంత్రమే జాబితా ప్రకటన
- జాబితాలో ఇద్దరు భారత రెజ్లర్లు పేర్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలు.. కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని కలిశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ వీరి సమావేశం సర్వత్రా ఆసక్తిగా మారింది. పారిస్ ఒలింపిక్స్‌లో ఉన్నప్పుడే వినేష్ ఫోగట్ కాంగ్రెస్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఇటీవల పంజాబ్-హర్యానా సరిహద్దులో అన్నదాతలు చేస్తున్న ఆందోళనకు వినేష్ ఫోగట్ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తు్న్నారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానం దాట వేసింది. మొత్తానికి ఊహాగానాలకు తెరదించుతూ ఆమె బుధవారం రాహుల్‌గాంధీని కలిసింది. త్వరలో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం ఖాయమని తేలిపోయింది.
ఇది కూడా చదవండి: GWMC : జీడబ్ల్యూఎంసీ పాత భవనం కూల్చివేతలో అధికారుల నిర్లక్ష్యం
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
పారిస్ ఒలింపిక్స్‌లో 100 గ్రాములు తేడా రావడంతో వినేష్ ఫోగట్ ఫైనల్‌కు వెళ్లకుండా నిష్క్రమించింది. దీంతో ఆమె తీవ్ర ఆవేదన చెందింది. ఆమెకు భారతీయుల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ఇక కుస్తి పోటీలకు స్వస్తి పలికి ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తాజా పరిణామాలను బట్టి అర్ధమవుతోంది. అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్డీఏ-ఇండియా కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొంది. మరోసారి అధికారం కోసం బీజేపీ ప్రయత్నిస్తుండగా.. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ కూటమి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే గెలుపు గుర్రాల కోసం హస్తం పార్టీ వెతుకలాట ప్రారంభించినట్లు సమాచారం. రెజర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాకు సీట్లు కేటాయించి విజయం సాధించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇదిలా ఉంటే ఎన్నికల్లో పోటీపై మాత్రం వినేష్ ఫోగట్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
ఇది కూడా చదవండి: PM Modi: సింగపూర్‌లో మోడీకి ఘనస్వాగతం.. డోలు వాయించిన ప్రధాని
హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ 34 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. తాజాగా రెజర్లు భేటీ కావడంతో తుది జాబితాను బుధవారం సాయంత్రం కల్లా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక్కడ అక్టోబర్ 5న పోలింగ్, 8న ఫలితాలు విడుదల కానున్నాయి.
नेता विपक्ष श्री @RahulGandhi से विनेश फोगाट जी और बजरंग पुनिया जी ने मुलाकात की। pic.twitter.com/UK7HW6kLEL
— Congress (@INCIndia) September 4, 2024
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!