గుజరాత్‌లో ఇటీవల వరదలు ముంచెత్తాయి. రోడ్లు, ఇళ్లు జలమయం అయ్యాయి. కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. రంగంలోకి దిగిన అధికారులు.. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే వడోదరలో ఓ కుక్కను స్థానికులు మంచంపై ఎక్కించుకుని తీసుకెళ్లిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలుచోట్ల మొసళ్ల ఇళ్లల్లోకి వచ్చిన దృశ్యాలు ఇప్పటికే నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా డాగ్‌ను రక్షించిన దృశ్యాలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇది కూడా చదవండి: Kerala: ఇన్సూరెన్స్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం
6-7 మంది యువకులు ఓ కుక్కను మంచంపై ఎక్కించుకుని సురక్షితంగా తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు చేయగా 5 వేల మందికిపైగా వీక్షించారు. దీనిపై అనేక మంది కామెంట్లు చేస్తున్నారు. అద్భుతమైన రెస్క్యూ ఆపరేషన్ అంటూ ప్రశంసించారు. జంతువులపై కూడా జాలి, దయ చూపిస్తున్నారని.. ఇది ఆరోగ్యకరమైన చర్యగా అభివర్ణించారు.