ఉక్రెయిన్‌పై రష్యా బాలిస్టిక్ క్షిపణులతో దాడులకు తెగబడింది. ఈ ఘటనలో 40 మంది మరణించారు. ఉక్రెయిన్‌లోని పోల్టావాలోని మిలిటరీ ఇన్స్టిట్యూట్పై రష్యా ప్రారంభించిన దాడిలో 40 మందికి పైగా మరణించారు. 180 మందికి పైగా గాయపడ్డారు.
పాకిస్థాన్‌లో గతేడాది మే 9న జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌సై సైనిక విచారణకు అవకాశం ఉందని రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తనను సైనిక కస్టడీకి అప్పగించకుండా అడ్డుకోవాలని కోరుతూ ఇస్లామాబాద్ హైకోర్టులో ఇమ్రాన్ ఖాన్ పిటిషన్ దాఖలు చేశారు.
చిన్న పిల్లలు నూడుల్స్ అనగానే లొట్టలేసుకుంటారు. అంతగా వాళ్లు దాన్ని ఇష్టపడి తింటారు. పైగా క్షణాల్లో తయారు కావడం.. తక్కువ ధరలోనే దొరకడంతో పిల్లలు నూడుల్స్‌కు ప్రాధాన్యత ఇస్తుంటారు. అదే ఆ బాలిక పాలిట శాపమైంది. స్కూల్ నుంచి రాగానే.. ఆకలి తీర్చుకునేందుకు నూడుల్స్ రెడీ చేసుకుని తింది.. తిన్న కొన్ని నిమిషాల్లోనే ప్రాణాలు విడిచింది.
త్వరలోనే హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటించేస్తున్నారు. అయితే ఇండియా కూటమిలో మాత్రం సందిగ్ధత నెలకొంది.
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం ఫ్లాట్‌గా ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు కారణంగా ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా అలాగే ట్రేడ్ అయ్యాయి.
ఖరీదైన పట్టుచీరలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న మహిళా ముఠాను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి రూ.17.5 లక్షల విలువైన 38 పట్టుచీరలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు మహిళలను అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
హమాస్ స్వాధీనంలో ఉన్న ఆరుగురు ఇజ్రాయెల్ బందీలు హతమయ్యారు. దీంతో ఇజ్రాయెల్‌లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా వ్యప్తంగా నిరసనలు చోటుచేసుకుంటున్నాయి. ఎయిర్‌పోర్టులు, ఆస్పత్రులు, బ్యాంకుల్లో సిబ్బంది సమ్మె చేస్తున్నారు. కాల్పులు విరమణకు ప్రధాని నెతన్యాహు ఒప్పుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
పాకిస్థాన్‌లో విమానం విండ్‌స్క్రీన్‌ను పైలెట్ క్లీన్ చేసిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైలర్ అవుతున్నాయి. టేకాప్‌కు ముందు ఎయిర్‌పోర్టులో విమానం ఆగి ఉండగా పైలెట్ కిటికీలోంచి బయటికి వచ్చి విండ్‌స్క్రీన్‌ను శుభ్రం చేశాడు. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది.
మణిపూర్‌లో డ్రోన్ బాంబు దాడి కలకలం రేపింది. ఈ ఘటనలో మహిళ గాయపడింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సెంజామ్ చిరాంగ్‌లో సోమవారం జరిగిన మరో డ్రోన్ బాంబు దాడిలో 23 ఏళ్ల మహిళ గాయపడినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.