రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ సింగపూర్ చేరుకున్నారు. బుధవారం బ్రూనై పర్యటన ముగించుకుని రెండు రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ వెళ్లారు. సింగపూర్‌లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోడీ డోలు వాయించి ఉత్సాహ పరిచారు. అలాగే ఎన్నారైలతో కలిసి ముచ్చటించారు. ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Akkineni Family: వరద బాధితులకు అక్కినేని కుటుంబం సాయం ఎంతంటే?
సింగపూర్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఒప్పందాలు జరగనున్నాయి. చివరిసారిగా 2018లో సింగపూర్‌కు వెళ్లిన మోడీ.. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి పర్యటిస్తున్నారు. మోడీ వెంట విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో పాటు ఇతర ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan on HYDRA: హైడ్రాపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..
భారత్-సింగపూర్ వ్యూహాత్మక భాగస్వామ్య పురోగతిపై నేతలు సమీక్షించుకుంటారని.. ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను మార్పిడి చేసుకుంటారని బ్రూనై, సింగపూర్‌కు బయలుదేరే ముందు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది.
ఇది కూడా చదవండి: ANR 100 : అక్కినేని నాగేశ్వరరావు ‘కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ ఫిల్మ్ ఫెస్టివల్
#WATCH | Prime Minister Narendra Modi tries his hands on a dhol. Members of the Indian diaspora welcomed PM Modi on his arrival in Singapore. pic.twitter.com/JBWG5Bnrzk
— ANI (@ANI) September 4, 2024
#WATCH | Prime Minister Narendra Modi arrives at Changi Airport on a two-day official visit to Singapore
During his visit, PM Modi will meet Singapore PM Lawrence Wong. PM Modi will call on President of Singapore Tharman Shanmugaratnam and interact with Singaporean leadership.… pic.twitter.com/PPBfoLYmVE
— ANI (@ANI) September 4, 2024
#WATCH | Prime Minister Narendra Modi welcomed by the Indian diaspora at a hotel in Singapore.
During his visit, PM Modi will meet Singapore PM Lawrence Wong and President Tharman Shanmugaratnam and interact with Singaporean leadership. He will also meet with business leaders… pic.twitter.com/qIfj8XXBEm
— ANI (@ANI) September 4, 2024