భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ ఇటీవల కాంగ్రెస్‌లో చేరింది. హస్తం పార్టీలో చేరిన కొద్ది సేపటికే ఆమెకు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కేటాయించింది. జులానా నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అయితే వినేష్ ఫోగట్ పొలిటికల్ ఎంట్రీపై ఆమె పెద్దనాన్న మహవీర్ ఫోగట్ తప్పుపట్టారు. ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు్న్నట్లు తెలిపారు
అప్పుడప్పుడు తొందర్లో విలువైన వస్తువులు బస్సుల్లోనూ.. ఆటోల్లోనూ మరిచిపోతుంటాం. కొంత సమయం తర్వాత గుర్తుకొచ్చాక.. లబోదిబో అంటుంటాం. ఇలా జీవితంలో అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనే హర్యానాలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది.
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు ఘటనపై ఎన్ఐఏ ఛార్జిషీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉగ్రవాదుల తొలి టార్గెట్ బెంగళూరులోని మల్లేశ్వరంలో ఉన్న బీజేపీ కార్యాలయాన్ని పేల్చడమేనని వెల్లడించింది. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం రోజే బీజేపీ కార్యాలయాన్ని ఐఈడీతో పేల్చేందుకు విఫలయత్నం చేసినట్లు తెలిపింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తెలుగు సినిమాలోని పాట మార్మోగుతుంది. ఏడాది చివరిలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ బరిలో ఉన్నారు. నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఇండోనేషియాలో విమాన ప్రమాదం తప్పింది. పపువాలో సోమవారం 42 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కూడిన విమానం టేకాఫ్ అవుతుండగా సడన్‌గా రన్‌వే నుంచి జారిపడ్డాది. సమీపంలోని ఫారెస్ట్‌లోకి దూసుకుపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలలో కుమారుడి పెళ్లి జరిపించిన టీచర్‌కి హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు చీవాట్లు పెట్టింది. ఈ పరిణామాన్ని తీవ్రంగా మందలించింది. ప్రభుత్వ పాఠశాలలో పెళ్లి ఎలా జరిపిస్తారంటూ న్యాయస్థానం నిలదీసింది. విచారణ సందర్భంగా టీచర్ క్షమాపణ చెప్పారు. నాలుగు వారాల్లోగా పాఠశాల క్యాంపస్‌లో రెండు వాటర్ ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఫైనాన్షియల్ టైమ్స్ మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ (FT MiM) 2024 గ్లోబల్ ర్యాంకింగ్స్ ఆదివారం విడుదల అయ్యాయి. అంతర్జాయతీ ర్యాంకింగ్స్‌లో భారతీయ వ్యాపార పాఠశాలలు బలమైన ఉనికిని చాటుకున్నాయి. భారతీయ విద్యాభవన్‌కు చెందిన ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ (SPJIMR) ప్రపంచవ్యాప్తంగా 35వ ర్యాంకు సాధించి అగ్రస్థానంలో చోటు సంపాదించుకుంది.
యాగి తుఫాన్ చైనాను హడలెత్తించింది. అత్యంత ప్రమాదకర స్థాయిలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. 234 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో మనుషులు, కార్లు కొట్టుకుపోయాయి. ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యాగి ప్రభావంతో వియత్నాం వణికిపోయింది. వదరలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 59కి చేరింది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాను ఇప్పటికే కాంగ్రెస్ రెండు లిస్టులను విడుదల చేసింది. సోమవారం సాయంత్రం మరో జాబితా విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. మూడు స్థానాలు మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం.
వరుస నష్టాలకు బ్రేక్ పడింది. గత వారం సూచీలు తీవ్ర నష్టాలను చవిచూశాయి. ఈ వారం మాత్రం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 375 పాయింట్లు లాభపడి 81, 559 దగ్గర ముగియగా.. నిఫ్టీ 84 పాయింట్లు లాభపడి 24, 936 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.94 దగ్గర ముగిసింది.