ఇండోనేషియాలో విమాన ప్రమాదం తప్పింది. పపువాలో సోమవారం 42 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కూడిన విమానం టేకాఫ్ అవుతుండగా సడన్‌గా రన్‌వే నుంచి జారిపడ్డాది. సమీపంలోని ఫారెస్ట్‌లోకి దూసుకుపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్రిగానా ఎయిర్‌కు చెందిన విమానం పాపువాన్ రాజధాని జయపురాకు టేకాఫ్ అవుతుండగా స్కిడ్ అయి రన్‌వే నుంచి తప్పుకుని బయటకు వెళ్లిపోయింది. కొంత మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కూడా చదవండి: Zelensky: త్వరలోనే భారత్‌కు జెలెన్‌స్కీ.. ప్రపంచ శాంతి స్థాపనపై చర్చ..!
పాపువాస్ సెరుయ్‌లోని స్టెవానస్ రుంబేవాస్ విమానాశ్రయంలో ట్రిగానా ఎయిర్ ఫ్లైట్ ATR 42–500 రన్‌వే నుంచి స్కిడ్ అయిందని అధికారులు తెలిపారు. కొంతమందికి గాయాలు అయ్యాయని తెలిపారు. విమానం దెబ్బ తిన్నట్లుగా చెప్పారు. అయితే ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదని పేర్కొన్నారు. విమానంలో ఒక శిశువుతో సహా అందరూ సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. ఇదిలా ఉంటే 2015లో త్రిగానా విమానం ఇదే ప్రాంతంలో కూలిపోవడంతో అందులో ఉన్న 54 మంది మరణించారు.
Trigana Air rute Serui-Jayapura tergelincir hari ini (9/9/2024) saat akan take off di bandara Stevanus Rumbewas, Serui. Salah satu penumpangnya adalah istri Pj Gubernur Prov. Papua, Ny. Ramses Limbong.
Cc : @kemenhub151 @PemprovPapua @jayapuraupdate pic.twitter.com/VQZSqYP4k7— ★ Paul Baka ★ (@PaulBaka12) September 9, 2024
JUST IN – Several passengers injured as plane skids off Indonesia runway https://t.co/NsMm999yd2
— Insider Paper (@TheInsiderPaper) September 9, 2024