యాగి తుఫాన్ చైనాను హడలెత్తించింది. అత్యంత ప్రమాదకర స్థాయిలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. 234 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో మనుషులు, కార్లు కొట్టుకుపోయాయి. ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యాగి ప్రభావంతో వియత్నాం వణికిపోయింది. వదరలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 59కి చేరింది. ఇక ఉత్తర వియత్నాంలో అనేక నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా ఓ ఉక్కు వంతెన హఠాత్తుగా కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో అనేక కార్లు, ట్రక్కులు కొట్టుకుపోయాయి. మరో ఘటనలో 20 మంది ప్రయాణికులతో కూడిన బస్సు కూడా వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది.
ఇది కూడా చదవండి: Bigg Boss Telugu 8: సీజన్ 1 నుంచే ఆంటీల సెంటిమెంట్.. ఫస్ట్ వీక్ బయటకొచ్చేసిన వారి లిస్ట్ ఇదే!
ఉక్కు వంతెన కూలిన ఘటనలో 10 కార్లు, ట్రక్కులు, రెండు బైక్‌లు నీళ్లలో పడిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. ముగ్గురిని రక్షించగా.. మరో 13 మంది గల్లంతయ్యారు. యాగి టైఫూన్ శనివారం వియత్నాం తీరం దాటగా.. ఆ సమయంలో అక్కడి ఉత్తర తీర ప్రాంతాలు వణికిపోయాయి. దాదాపు 234 కిలోమీటర్ల వేగంగా ప్రచండ గాలులు వీచాయి. దీంతో వియత్నాం వణికిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో 30 లక్షల మందికి పైగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ఈ ప్రాంతాన్ని తాకిన అత్యంత శక్తిమంతమైన టైఫూన్‌ల్లో ‘యాగి’ని ఒకటిగా పేర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి: Vijayawada: వరద బాధితుడిని చెంపదెబ్బ కొట్టిన వీఆర్వో..
వంతెన కూలిపోయిన ఘటనలో 10 కార్లు, రెండు స్కూటర్లు ఎర్ర నదిలో పడిపోయినట్లు ఉప ప్రధాన మంత్రి హో డక్ ఫోక్ సోమవారం తెలిపారు. ముగ్గురు రక్షించగా.. 13 మంది గల్లంతయ్యారని వెల్లడించారు. ఇక ప్రాణనష్టం ఎంత జరిగింది అనేది ఇంకా స్పష్టత రాలేదన్నారు. వీలైనంత త్వరగా పాంటూన్ వంతెనను నిర్మించాలని మిలిటరీని ఆదేశించినట్లు మంత్రి హో చెప్పారు. యాగీ ఈ సంవత్సరం ఆసియాలో అత్యంత శక్తివంతమైన తుఫానుగా అభివర్ణించారు. ఇది శనివారం వియత్నాంలో ల్యాండ్‌ఫాల్‌లో తీరం దాటినప్పుడు 59 మంది చనిపోయారని వెల్లడించారు. గంటకు 203 కిమీ (126 mph) వేగంతో బలమైన గాలులు వీచాయన్నారు. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల కారణంగా కనీసం 44 మంది బాధితులు మరణించారని దేశ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. వీరిలో 68 ఏళ్ల మహిళ, ఏళ్ల బాలుడు మరియు నవజాత శిశువు ఉన్నారన్నారు. 240 మందికి పైగా గాయపడ్డారని చెప్పారు. 1.5 మిలియన్ల మంది ఇప్పటికీ విద్యుత్తు లేకుండా ఉన్నారని తెలిపారు. హనోయితో సహా 12 ఉత్తర ప్రావిన్స్‌లలో పాఠశాలలు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి. డజన్ల కొద్దీ ఫిషింగ్ బోట్లు కొట్టుకుపోయాయి. ఆదివారం డజను మంది మత్స్యకారులు తప్పిపోయినట్లు నివేదిక అందిందన్నారు. వియత్నాంలోని తీరప్రాంత పట్టణాల నుంచి దాదాపు 50,000 మంది ప్రజలను ఖాళీ చేయించారు. అధికారులు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరిక జారీ చేశారు.
#WATCH 🇻🇳Typhoon Yagi, the strongest in decades, hit Vietnam, causing at least 59 deaths. Many are missing due to landslides and floods.
A bridge collapsed, millions lost power, and a bus with 20 passengers was swept away. The storm struck on Saturday and weakened to a tropical… pic.twitter.com/Ikqqm7z8h0
— 凤凰欧洲 PhoenixCNE News (@PhoenixCNE_News) September 9, 2024
During the super typhoon #Yagi in #Vietnam, many car drivers drove very slowly to shield motorbikes and people from the strong wind (because the strong wind trapped them on the road or on the bridge, they could be blown away if they tried to move). Wanted to hug everyone tightly. pic.twitter.com/rW8ZfYCank
— Phan Kim Thanh ⁷ ( ´・ω・) ~ Ꮚ ( •᷄ɞ•᷅ ) (@Alzheimer_13) September 8, 2024