అప్పుడప్పుడు తొందర్లో విలువైన వస్తువులు బస్సుల్లోనూ.. ఆటోల్లోనూ మరిచిపోతుంటాం. కొంత సమయం తర్వాత గుర్తుకొచ్చాక.. లబోదిబో అంటుంటాం. ఇలా జీవితంలో అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనే హర్యానాలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Snacks: ఈ స్నాక్స్ తింటున్నారా.. ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్టే..!
గురుగ్రామ్‌కు చెందిన మహిళ హౌస్ షిప్టింగ్ అయింది. కొత్త ఇంటికి వెళ్లేందుకు తన స్నేహితురాలితో కలిసి ఆటోలో వెళ్లింది. గమ్యస్థానానికి చేరుకోగానే కంగారులో డబ్బు చెల్లించేసి దిగేసి వెళ్లిపోయారు. ఆటోలో ఉన్న విలువైన ఆభరణాల బ్యాగ్‌ను మరిచిపోయి ఇంట్లోకి వెళ్లిపోయారు. బ్యాగ్‌లో డాక్యుమెంట్లు, క్రిడెట్ కార్డులు, డైమండ్‌తో పొదిగిన బంగారు గొలుసు ఉంది. కొద్దిసేపటి తర్వాత గుర్తుకొచ్చి ఆందోళన చెందారు. మొబైల్ నుంచి యూపీఐ ద్వారా డబ్బు చెల్లించడంతో.. అందులో ఉన్న నెంబర్‌కు సంప్రదించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కానీ ఆటో డ్రైవర్ మాత్రం మహిళలను దించేసిన చోటికి వచ్చి మేనేజర్‌కు బ్యాగ్ ఇచ్చేసి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని వారికి తెలియజేయమని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. మహిళలకు విషయం తెలిసి బ్యాగ్ చెక్ చేసుకోగా.. వస్తువులన్నీ భద్రంగా ఉన్నాయి. దీంతో వారి ఆనందానికి అవధులు లేవు. చాలా సంతోషించారు. ఇదే విషయాన్ని మహిళ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఆటో డ్రైవర్ వ్యక్తిత్వాన్ని కొనియాడింది. దీంతో ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఆటోడ్రైవర్‌ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తున్నారు. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని పలువురు పేర్కొ్న్నారు. ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్లు ఉన్నారా? అంటూ మరికొందరు కామెంట్లు పెట్టారు.
ఇది కూడా చదవండి: Kamala Harris: తెలుగు సినిమా పాటతో కమలా హారిస్ ఎన్నికల ప్రచారం