చండీగఢ్‌లో పట్టపగలు ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. గ్రెనేడ్ దాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు జరగగానే కొందరు ఆటోలో పారిపోగా.. ఇంకొరు పరుగెత్తుకుంటూ వస్తున్న వ్యక్తి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
పాకిస్థాన్‌ను భూప్రకంపనలు హడలెత్తించాయి. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.8గా నమోదైంది. దీని ప్రభావం ఉత్తర భారత్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. ఢిల్లీ-ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. ఆగస్టు 9న కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలిపై అత్యంత క్రూరంగా హత్యాచారం జరిగింది. అనంతరం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్-కమలా హారిస్ మధ్య తొలి డిబేట్ జరిగింది. అయితే అమెరికన్ పాప్‌స్టార్ టేలర్ స్విఫ్ట్.. బహిరంగంగా కమలా హారిస్‌కు మద్దతు తెలిపారు. ఈ విషయం మాజీ అధ్యక్షుడు ట్రంప్ కోపం తెప్పించింది.
ప్రధాని మోడీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీనియర్ సిటిజన్లను దృష్టిలో పెట్టుకుని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
బీజేపీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంత్‌నాగ్‌లో ఖర్గే పర్యటించారు. ఈ సందర్భంగా కమలం పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల్లో తమకు మరో 20 సీట్లు వచ్చుంటే వారంతా జైల్లో ఉండేవారని వ్యాఖ్యానించారు.
ఆఫీస్ అంటే ఒక సిస్టం.. ఒక పద్ధతి.. కొన్ని రూల్స్ ఉంటాయి. ఎవరి హద్దుల్లో వారుండి ఉద్యోగులు పని చేసుకోవాలి. అంతేకాని ఆఫీస్‌లో తమ ఇష్టప్రకారం నడుచుకుంటామంటే ఏ కంపెనీ ఊరుకోదు. అలాంటిది వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ జంట ఆఫీసులోనే జుగుప్సాకరంగా ప్రవర్తించారు. బహిరంగంగానే శృంగార కార్యకలాపాలకు పూనుకున్నారు.
కడుపు నిండా తిని.. బిల్లు చెల్లించమన్న పాపానికి ఓ వెయిటర్ పట్ల కస్టమర్లు దుర్మార్గంగా ప్రవర్తించారు. వెయిటర్‌ను కారులో కిలోమీటర్ ఈడ్చుకెళ్లారు ఈ ఘటన మహారాష్ట్రలోని ఓ హోటల్ దగ్గర చేటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కస్టడీని ట్రయల్ కోర్టు పొడిగించింది. సెప్టెంబర్ 25 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన కస్టడీ బుధవారంతో ముగియడంతో మరోసారి కస్టడీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.